Begin typing your search above and press return to search.

చరణ్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్ కూడా

By:  Tupaki Desk   |   10 Dec 2017 12:40 PM GMT
చరణ్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్ కూడా
X
మలయాళ అమ్మాయి అను ఇమ్మాన్యుయెల్ ఊపు మామూలుగా లేదిప్పుడు. స్వల్ప వ్యవధిలో వరుసగా వరుసబెట్టి భారీ సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్లిపోతోంది ఈ యంగ్ హీరోయిన్. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్నాతవాసి’లో ఒక కథానాయికగా.. అల్లు అర్జున్ మూవీ ‘నా పేరు సూర్య’లో లీడ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మాయి ఇటీవలే చరణ్ తో నటించే ఆఫర్ అందుకున్నట్లు మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు మరో బంపరాఫర్ తగిలినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అను జత కట్టబోతోందట.

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారానే అనుకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఐతే ఆయన ఈ ఒక్క సినిమాకే కాక.. ఆమెతో రెండు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో చేయబోయే సినిమాకు కూడా ఆమెను ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా అను అనుకుంటున్నారట. అదిరిపోయే కాంబినేషన్లో సినిమా కావడంతో పారితోషకం గురించి కూడా ఆలోచించకుండా వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేసిందట అను. మొత్తానికి వచ్చే ఏడాది తెలుుగో అను ఇమ్మాన్యుయెల్ ఊపు మామూలుగా ఉండబోదన్నమాట.