Begin typing your search above and press return to search.

అంటే.. ముందు ఎక్స్ పోజింగ్.. తరువాత నో??

By:  Tupaki Desk   |   29 Sep 2016 1:30 AM GMT
అంటే.. ముందు ఎక్స్ పోజింగ్.. తరువాత నో??
X
తెలుగులో కొత్తగా పరిచయం అయిన నూతన హీరోయిన్ అనూ ఎమ్మానుయేల్. అమ్మడు ఇప్పుడు ''మజ్ఞూ'' సినిమా సక్సెస్ తో క్లౌడ్ నైన్ మీద ఉంది. అంతేకాదు ఈ సినిమాను రిలీజ్ చేయకమునుపే గోపిచంద్ హీరోగా చేస్తున్న ''ఆక్సిజన్''లో కూడా చోటు దక్కించుకుంది కాబట్టి.. ఫుల్లు హ్యాపీసంట. అయితే టాలీవుడ్ లో ఈమె తన జర్నీ పలానా విధంగా ఉండాలంటూ ప్లాన్ చేసుకుందిలే.

''నేను హైదరాబాద్ నా సెకండ్ హోమ్ లా ఫీలవుతున్నా. అందరూ భయపెట్టారు కాని.. తెలుగు ఇండస్ర్టీలో హీరోయిన్లను చాలా గౌరవంగా చూస్తారు. నాకు ఆ విషయం బాగా నచ్చింది. ఇక నేను తెలుగులో నయనతార తరహాలో దూసుకుపోవాలని అనుకుంటున్నా. తను చేసిన తమిళ సినిమాలు చూశాను కాని, తెలుగు సినిమాలు మాత్రం చూడలేదు'' అంటూ సెలవిచ్చింది అమ్మడు అనూ. అయితే నయనతార అంది చూశారూ.. అక్కడే మనకు కొన్ని సందేహాలు వచ్చేశాయి.

తెలుగులో నయనతార ముందులో బాగా ఎక్స్ పోజింగ్ తరహా పాత్రలే చేసింది. తరువాత వెయిట్ తగ్గి స్లిమ్ అయ్యాక ఆంటీ పాత్రలు కూడా పోషించింది. కాని రాను రాను ఎక్స్ పోజింగ్ చేయను అంటూ కండిషన్ పెట్టి.. ఏవేవో ఫ్లాపు సినిమాల్లో నటిస్తోంది. మరి ఇంతకీ అనూ ఎమ్మానుయేల్ ఈ నయనతార రూటు గురించి కాస్త క్లారిటీ ఇస్తే బెటరేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/