నాని సరసన అను కజిన్!

Fri Aug 17 2018 07:00:26 GMT+0530 (IST)

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితి. కెరీర్ తొలినాళ్లలోనే పెద్ద హీరోలతో చేసే చాన్స్ కొట్టేసిన అను....ఆశించినంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. మజ్ను తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.... పవన్ బన్నీలతో నటించినా.....ఆ సినిమాలు డిజాస్టర్ లు కావడంతో అను ఫేట్ మారలేదు. త్వరలో రాబోతోన్న శైలజా రెడ్డి అల్లుడిపైనే అను ఆశలన్నీ పెట్టుకుంది. అయితే ఈ క్రమంలోనే అనుకు పోటీగా ఆమె ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ వస్తోందట. అను కజిన్ కూడా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైంది. నాని హీరోగా నటించబోతోన్న ‘జెర్సీ’ సినిమాలో నానికి జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బా మోనికా జాన్‌ని ఎంపిక చేశారు.బాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా కజిన్ పరిణీతి చోప్రా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. అదే తరహాలో టాలీవుడ్ లో కజిన్ కల్చర్ ను అను స్టార్ట్ చేయబోతోంది. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కబోతోన్న‘జెర్సీ’లో అనూ ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బా మోనికా జాన్ ను ఎంపిక చేశారట. తమిళంలో రెండు మలయాళంలో రెండు సినిమాల్లో ఆల్రెడీ హీరోయిన్‌గా నటించిందట. అయితే ఈ అక్కా చెల్లెళ్లిద్దరూ నాని సినిమాతోనే తెరంగేట్రం చేయడం విశేషం. అను ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ మూవీ ఆఫర్ ‘ఆక్సీజన్’. కానీ మజ్ను ముందుగా విడుదలైంది. మరిఅక్క లాగా కాకుండా ఈ చెల్లెలికి టాలీవుడ్ లో లక్ కలిసొస్తుందేమో వేచి చూడాలి.