ఫొటో స్టోరీ :మరో పదేళ్లు పక్కా

Mon Sep 11 2017 22:57:16 GMT+0530 (IST)

నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో మెరిసింది. తెలుగు ప్రేక్షకులకు కనిపించింది రెండు సినిమాల్లోనే అయినా అమ్మడు సోషల్ మీడియాలో అప్పుడపుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ను బాగానే ఆకర్షిస్తోంది.రీసెంట్ గా విజయవాడలో షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన అమ్మడు అక్కడ మోడ్రన్ డ్రెస్ లో మెరిసి తన అందంతో అందరిని మాయ చేసింది. కళ్ళతోనే నవ్వతూ అమ్మడు ఇచ్చిన లుక్స్ సెక్సీగా ఉన్నాయి.అలాగే టాప్ టూ బాటమ్ చూస్తుంటే అందానికే అందం అనేలా ఉంది.  మొన్ననే 20 లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మని చూస్తుంటే మరో పదేళ్లు సౌత్ లోనే టాప్ హీరోయిన్ తన అందంతో మెప్పించేలా ఉందనిపిస్తోంది.

ఎందుకంటే ప్రస్తుతం అను చాలా బిజీగా ఉంది. అమ్మడు చేతిలో ఇప్పుడున్నవన్నీ దాదాపు పెద్ద సినిమాలే పవన కళ్యాణ్ - అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో నటిస్తోంది. ఇక తమిళ్ లో విశాల్ తో చేసిన ఓ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. తెలుగులో కూడా ఆక్సిజన్ సినిమాలో చేసిందిలే.