Begin typing your search above and press return to search.

బ్యూటీ కి ఆ రేంజ్ డెడికేషన్ ఉందట!

By:  Tupaki Desk   |   10 Dec 2018 5:11 AM GMT
బ్యూటీ కి ఆ రేంజ్ డెడికేషన్ ఉందట!
X
అదితి రావు హైదరీ తెలుగు ఆడియన్స్ కు మణిరత్నం సార్ డబ్బింగ్ ఫిలిం 'చెలియా'తోనే పరిచయం అయ్యింది గానీ స్ట్రెయిట్ తెలుగు సినిమా మాత్రం ఇంద్రగంటి మోహన కృష్ణ - సుధీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన 'సమ్మోహనం'. ఈ సినిమా హిట్ కావడమే కాదు.. అదితికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదితి చేస్తున్న సెకండ్ తెలుగు సినిమా 'అంతరిక్షం'.

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటుగా అదితి కూడా ఒక వ్యోమగామి గా నటిస్తోంది. దీంతో యాభై రోజుల పాటు హార్నెస్(ఆస్ట్రోనాట్స్ ధరించే బెల్ట్) తో షూట్ లో పాల్గొంది. అదేమీ అంత సులువైన విషయం కాదు. దీంతో నడుము నొప్పి వచ్చిందట. కానీ జస్ట్ రెండు రోజులు మాత్రమే రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ కు రెడీ అయిపోయిందట. అదితి డెడికేషన్ చూసిన 'అంతరిక్షం' టీమ్ షాక్ అయ్యారట.

ఈ రేంజ్ లో కష్టపడుతోందంటే ఖచ్చితంగా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రే అయి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎక్కువ ప్రాధాన్యత లేదని ఈ పాత్రను అదితి మొదట్లో రిజెక్ట్ చేసిందట. కానీ ఈ సినిమాలో అదితిని ఎలాగైనా నటింపజేయాలనుకున్న సంకల్ప్ అదితి పాత్రను మళ్ళీ మార్చి రాసి ఆమెను ఒప్పించాడట. మరి అదితి తన నటనతో ప్రేక్షకులను ఎలా సమ్మోహన పరుస్తుందో వేచి చూడాలి.