`అంతరిక్షం`రిలీజ్ డేట్ ఫిక్స్?

Thu Jul 12 2018 18:03:25 GMT+0530 (IST)

మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరో వరుణ్ తేజ్...వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఫిదాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్.....ఆ తర్వాత తొలిప్రేమతో మరో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అంతరిక్షయానం నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో వరుణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని డిసెంబరు 21న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి `అంతరిక్షం` అనే టైటిల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తయిందని తెలుస్తోంది.`ఘాజీ`చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్న సంకల్ప్ రెడ్డి మరోసారి విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతరిక్షయానం నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ సరసన అదితిరావ్ హైదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీ సెట్స్ ను రూపొందించారు. ఆ సెట్స్ లో హాలీవుడ్ నిపుణులతో యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కు అనువుగా వరుణ్ - అదితిలకు 3డీ స్కాన్ కూడా నిర్వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి - సాయిబాబులు నిర్మిస్తోన్న ఈ చిత్రం...డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోన్నట్లు సమాచారం.