ఫస్ట్ లుక్: అంతరిక్షం లో మెగా అస్ట్రోనాట్

Wed Aug 15 2018 09:30:17 GMT+0530 (IST)

తెలుగు సినిమా ఈమధ్యకాలంలో కొత్తపుంతలు తొక్కుతోంది. తెలుగు ఫిలిం మేకర్స్ తమ కథాకథనాల్లో వైవిధ్యం చూపిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయడమే కాకుండా ఇతర భాషా ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఇప్పటికే 'ఘాజి' సినిమాతో ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించాడు.  తాజాగా సంకల్ప్ రెడ్డి మెగా హీరో వరుణ్ తేజ్ తో ఒక స్పేస్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు.ఈ స్పేస్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేశారు నిర్మాతలు.  ఫస్ట్ లుక్ లోనే టైటిల్ - రిలీజ్ డేట్  కూడా వెల్లడించారు. 'అంతరిక్షం 9000 KMPH' సినిమా టైటిల్. డిసెంబర్ 21 న ఈ సినిమా ను రిలీజ్ చేస్తున్నారు.  ఇక ఫస్ట్ లుక్ లో వరుణ్ వ్యోమగామి గెటప్ లో కనిపించాడు. స్పేస్ లో తమ వ్యోమనౌక కు దగ్గరగా ఎదో రిపేర్ చేస్తున్నట్టుగా ఉన్నాడు.  టాలీవుడ్ లో ఇలాంటి పోస్టర్ మాత్రం మొదటి సారి అని చెప్పొచ్చు. 

జీరో గ్రావిటీ సీన్స్ షూట్ చేసేందుకు 'అంతరిక్షం' టీమ్ హాలీవుడ్ నిపుణుల సహాయం తీసుకున్న సంగతి తెల్సిందే.  జ్ఞాన శేఖర్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రశాంత్ R. విహారి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.