మరో మెగా హీరో సినిమా రేపే లాంచ్

Sun Jan 20 2019 16:55:35 GMT+0530 (IST)

మెగా ఫ్యామిలీ నుండి మరో కొత్త మెగా హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు చాలా రోజుల క్రితమే వచ్చాయి.  సాయి ధరమ్ తేజ్ తమ్ముడు.. మరో మెగా మేనల్లుడు అయిన వైష్ణవ్ తేజ్ లాంచ్ సినిమాను సుకుమార్ బ్యానర్.. మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తాడు.ఈ సినిమాకు జనవరి 21 న పూజాకార్యక్రమాలు నిర్వహించి అధికారికంగా లాంచ్ చేస్తారట. ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీగా సాగుతుందని సమాచారం. కొత్తహీరో అయినప్పటికీ ఈ సినిమాకు టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడు..  శ్యామ్ దత్ సినిమామాటోగ్రఫీ డిపార్టుమెంట్ చూసుకుంటారు.  నవీన్ నూలి ఎడిటర్.. రామకృష్ణ - మౌనిక జంట ఆర్ట్ డైరెక్టర్లు.  

ఈ సినిమాలో హీరోయిన్.. ఇతర నటీనటుల వివరాలు రేపు లాంచ్ ఈవెంట్ సందర్భంగా వెల్లడిస్తారట.  మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో ఇప్పటివరకూ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది.  ఈ కొత్త మెగా హీరోకు లాంచ్ ప్యాడ్ కూడా మంచిదే సెట్ అయింది కాబట్టి మొదటి సినిమాతోనే మెగా హిట్ సాధిస్తాడేమో వేచి చూడాలి.