Begin typing your search above and press return to search.

వెండి తెరపై మరో క్రికెటర్‌

By:  Tupaki Desk   |   15 Oct 2019 5:07 AM GMT
వెండి తెరపై మరో క్రికెటర్‌
X
క్రికెట్‌ మరియు సినిమాలకు చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎప్పటి నుండో క్రికెట్‌ మరియు సినిమా కలిసి పోతున్నాయి. క్రికెటర్లు సినిమా వారితో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటం.. పలువురు ఫిల్మ్‌ స్టార్స్‌ ను క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం మనం చూశాం. ఇక అప్పుడప్పుడు క్రికెటర్లు వెండి తెరపై మెరవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే టీం ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే మరో క్రికెటర్‌ కూడా వెండి తెరపై కనిపించబోతున్నాడు.

టీం ఇండియాలో పేస్‌ బౌలర్‌ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఆల్‌ రౌండర్‌ గా గుర్తింపు దక్కించుకున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. 2012 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ కు దూరంగా ఉంటున్న పఠాన్‌ బ్యాట్‌ పట్టకున్నా క్రికెట్‌ లో మిలితం అయ్యి ఉంటున్నాడు. టీం ఇండియా ఎక్స్‌ పర్ట్‌ ప్యానల్‌ లో ఒక సభ్యుడిగా కొనసాగుతున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ త్వరలో ఒక తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా పఠాన్‌ ప్రకటించాడు.

తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ 58వ చిత్రంలో తాను నటించబోతున్నట్లుగా పఠాన్‌ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నాడు. కొత్త వెంచర్‌.. కొత్త ఛాలెంజ్‌ ను స్వీకరించబోతున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందించబోతున్న ఈ చిత్రంలో పఠాన్‌ ఎలాంటి పాత్రను పోషిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంతో సక్సెస్‌ అయితే పఠాన్‌ ను హీరోగా కూడా మనం చూస్తామేమో.