Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ న్యూడ్ ఫోటో లీకైంది

By:  Tupaki Desk   |   18 Aug 2017 10:10 AM GMT
స్టార్ హీరోయిన్ న్యూడ్ ఫోటో లీకైంది
X
ఇంటర్నెట్ వచ్చిన తరువాత ప్రపంచం స్థితి పూర్తిగా మారింది. దాని వలన ప్రపంచమే ఒక చిన్న కుగ్రామం లా మారింది. అయితే ఈ పరిణామం మనకు మంచిదే కానీ దీని వలన కొంతమంది సెలబ్రిటీలు కొన్ని రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇంటర్నెట్ వలన ఒక కొత్త పదం ఒక కొత్త వృతి పుట్టింది.. అదే హాకింగ్. ఇప్పుడు ఈ హేకర్లు చేస్తున్న గలాటా అంతా ఇంతా కాదనుకోండి. ఈ మధ్య వీళ్ళు హాలీవుడ్ నటీనటులు మీద పడ్డారులే. మరీ ముఖ్యంగా హీరోయిన్ల మీద పడ్డారు. రెండు రోజుల కిందట ఆస్కార్ అవార్డ్ గ్రహీత స్టార్ హీరోయిన్ అన్నా హాత్వే సోషల్ మీడియా ఎకౌంట్ ని హ్యాక్ చేసి పెద్ద దుమారం సృష్టించారు.

ఆమెకు సంబందించిన ఒక ప్రైవేట్ ఫోటో ని లీక్ చేసి వరల్డ్ మొత్తం మీద ట్రెండింగ్ టాపిక్ గా మార్చారు. ఈ ఫోటో లో ఈ నటి న్యూడ్ గా కనిపించడంతో ఆ వార్త వీరంగం చేస్తూ వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో. ఇలా జరగడం ఇదే మొదటసారి కాదు హాలీవుడ్ లో. కొన్ని నెలలు కిందట కూడా పాప్ సింగర్ మిలే సైరస్ ఆన్ లైన్ ఎకౌంట్ ని హ్యాక్ చేసి అప్పట్లో సంచలనం చేశారు. ఆగష్టు 31- 2014 లో ఒక వెబ్ సైట్ దాదాపుగా 500 స్టార్ల ప్రైవేట్ ఫోటోలను హక్ చేసి వాళ్ళ సైట్ లలో పోస్ట్ చేసింది. ఇందులో ఎక్కువగా హీరోయిన్ల ఫోటోలు ఉండటం బాధాకరం. ఇప్పుడు కూడా అన్నా ఫోటోలను యాపిల్ అందిస్తున్న సర్విసుల్లో ఒకటైన ఐ-క్లౌడ్ ను హ్యాక్ చేసి తీసుకున్నారని అంటున్నారు.

ఈ సంఘటనతో కొంతమంది స్టార్ హీరోయిన్లు ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్ వాడటానికి భయపడుతున్నారు. అందుకే సైబర్ సెక్యూరిటి ఇవ్వడంలో ఇప్పుడు ఫోన్లు ఇతర యాప్ లు అన్నీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మామూలు జనాలు ఎవరూ ఈ సైబర్ సెక్యూరిటి గురించి మాట్లాడకుండా ఆమె ఫోటో ఎందుకు పెట్టింది అలా ఎందుకు ఉందని వింత వింతగా కామెంట్లు చేస్తున్నారు.