మమ్మూటీపై కామెంట్:అమ్మడు సారీ చెప్పిందిగా

Wed Sep 27 2017 15:52:19 GMT+0530 (IST)

నోటిని అదుపులో పెట్టుకోకపోతే.. అది తెలుగైనా.. మలయాళమైనా.. అంతే.. ఫ్యాన్స్ ఉతికి ఆరేస్తారు! నోటికి ఎంత మాటొస్తే.. అంతా అనేయడం ఇటీవల కాలంలో ఫ్యాషన్ గా మారిపోయింది. `అలా అనేసి` ఏదో సంచలనం సృష్టించేశామని డబ్బా కొట్టుకోవడం కూడా కామన్ అయింది. అయితే ఆ తర్వాత ఉంటుంది అసలు మజా అన్నట్టు.. ఇప్పడు కేరళ మెగా స్టార్ మమ్మూటి విషయంలో ఓ వర్థమాన హీరోయిన్ చేసిన కామెంట్ అమ్మడిని కన్నీరు పెట్టించింది.  లబోదిబో మని ఏడుస్తూ.. ఫేస్ బుక్ లో క్షమాపణలు చెప్పింది. దీంతో ఇప్పుడు కేరళ సినీవర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.విషయంలోకి వెళ్తే..  మాలీవుడ్(మలయాళం) మెగాస్టార్ మమ్మూటీ ఆయన తనయుడు సల్మాన్ దుల్కర్ లు భారీ ఎత్తున అభిమానులను సంపాయించుకున్నారు. ప్రస్తుతం వివిధ మూవీల్లో బిజీబిజీగా ఉన్నారు. ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాయించారు. మోహన్ లాల్ వంటి నాయకులు ఉన్నా కూడా మమ్మూటి రేంజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలావుంటే  వర్ధమాన హీరోయిన్  అన్నా రాజన్ ఇటీవల ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. మమ్మూటికి వయసైపోయిందనే యాంగిల్ లో తన నోటి దూలను ప్రదర్శించింది.

మమ్మూటి - సల్మాన్ లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని రాజన్‌ను యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దుల్కర్ తో నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా మాట్లాడింది. అంతే! మమ్మూటీ అభిమానులు రెచ్చిపోయారు. రాజన్ తండ్రిని సైతం వదలకుండా ఫేస్ బుక్ - ట్విట్టర్ లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది.

‘మమ్మూటీ సర్ ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్లు చేయలేదు.  దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ.. దుల్కర్ కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు మమ్మూటీతో కూడా జోడీగా నటించనున్నట్టు నేను చెప్పాను. కానీ ఆ ప్రోగ్రాం నిర్వాహకులు టీఆర్పీ కోసం మొదటి సగం వరకే చూపించారు. ఫలితం నాపై తీవ్ర స్థాయిలో పడింది. అంతా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిద్దరినీ నేను అవమానించేలా మాట్లాడలేదు. క్షమించండి’ అని వీడియోలో కోరింది. సో.. ఇదీ స్టోరీ..!!