Begin typing your search above and press return to search.

అతని స్వరం.. సోనాల్‌ గ్లామరసం.. ప్చ్

By:  Tupaki Desk   |   26 May 2016 5:27 PM GMT
అతని స్వరం.. సోనాల్‌ గ్లామరసం.. ప్చ్
X
సింగర్‌ అంకిత్‌ తివారి గుర్తున్నాడుగా.. సున్‌ రహా హై అంటూ దేశాన్ని అలరించాడే.. అతగాడు. ఈ మధ్య కాలంలో మ్యూజిక్‌ డైరక్టర్‌ గా చాలా సినిమాలే చేస్తున్నాడు. అయితే 2014లో రేప్ కేస్ యాలిగేషన్స్ ఎదుర్కొన తరువాత.. ఇతగాడు క్లీన్‌ షేవ్‌ నుండి గెడ్డం లుక్‌ కు మారిపోయాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇప్పుడు ఒక 'బడ్తమీజ్‌' అంటూ ఒక స్పెషల్‌ సాంగ్‌ కంపోజి చేసి.. పాడి.. వీడియో తీసి.. రిలీజ్ చేశాడు.

సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌ గా సాగే ఈ ఏడు నిమిషాల పాట అంత బీభత్సంగా ఏమీ లేదులే. ఏదో మనోడు చాలా రెగ్యులర్‌ గా వినేసిన ట్యూన్లను మళ్ళీ మళ్లీ కలిపి ఏదో వండేశాడు అన్నట్లు ఉంది. అయితే పాట విజువల్స్ లో ప్రొడక్షన్‌ క్వాలిటీ అదిరిపోయింది. అలాగే సోనాల్ అందాలు కూడా యాడెడ్‌ ఎస్సెట్‌. అమ్మడు ఎప్పటిలాగానే బికినీ టాపుల్లో.. కైపెక్కే చూపులతో.. పిచ్చెత్తించింది. అయినాసరే స్టోరీ వైజ్ పాటలో కంటెంట్‌ పెద్దగా టచ్చింగ్ గా లేకపోవడంతో జనాలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

మరి ఇతగాడి స్వరం.. ఆమె గ్లామరసం.. యుట్యూబ్‌ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాయనేది చూస్తే.. అప్పుడు సోనాల్‌ కు కూడా మరోసారి బాలీవుడ్‌ లో ఏమైనా పెద్ద ఛాన్సులు వస్తాయా అనేది తెలుస్తుంది.