Begin typing your search above and press return to search.

అంజలి పాపా.. ఏంటా పోజు?

By:  Tupaki Desk   |   28 Nov 2015 11:14 AM GMT
అంజలి పాపా.. ఏంటా పోజు?
X
అంజలిని ఇప్పటిదాకా రకరకాల అవతారాల్లో చూశాం. కానీ ఏ అవతారంలోనై అయినా పద్ధతిగా, సాఫ్ట్ గానే కనిపించింది. కానీ తన గాడ్ ఫాదర్ కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ‘శంకరాభరణం’లో మాత్రం అంజలి ఓ షాకింగ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. దొంగల రాణిగా చాలా రఫ్ గా ఉండే క్యారెక్టర్ లో ‘కబ్ ఆయేగా అస్లీ దివాలి’ అంటూ అంజలి డైలాగ్ చెప్పిన తీరు చూసి అందరూ షాకైపోయారు. సినిమలోనూ ఆమె పాత్ర ఇంకా సెన్సేషనల్ గా ఉంటుందని.. జనాలు ఇంకా మరిన్ని షాకులు తినబోతున్నారని అంటున్నారు యూనిట్ సభ్యులు.

కాగా ‘శంకరాభరణం’ ప్రమోషన్లలో భాగంగా ట్విట్టర్ లో రోజూ కౌంట్ డౌన్ ఇస్తున్నారిప్పుడు. నిన్న ‘6 డేస్ టు గో’ అంటూ కౌంట్ డౌన్ లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే దిమ్మదిరగడం ఖాయం. అంత షాకింగ్ పోజు ఇచ్చింది అంజలి. మన రాజోలు పాపలో ఇంత హాట్ నెస్ ఉందా? అని డౌటొచ్చేలా ఉంది ఆ పోస్టర్. క్యారెక్టరుకి తగ్గట్లు ఒకరకమైన విచ్చలవిడి తనం, పొగరు కనిపిస్తోంది ఆ క్యారెక్టర్ లో. అంజలి ఈ తరహా పాత్ర వేయడమే ఆశ్చర్యమంటే.. ఇలా పోజులివ్వడం ఇంకా ఆశ్చర్యమే. డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోయే ‘శంకరాభరణం’లో ఇంకెన్ని చిత్రాలు చూడబోతున్నామో.