ఏంటి.. ఈమె మన అంజలేనా?

Mon Mar 12 2018 09:32:08 GMT+0530 (IST)

కొందరు హీరోయిన్లు బేసిగ్గా కొంచెం బొద్దుగా కనిపిస్తారు. వాళ్లు ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోయినా లుక్ తేడా కొట్టేస్తుంది. అలాంటి హీరోయిన్లలో అంజలి కూడా ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి అంజలి బొద్దుగానే కనిపిస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘గీతాంజలి’ లాంటి హిట్ సినిమాల్లో కూడా అంజలి కొంచెం లావుగానే దర్శనమిచ్చింది. ఈ సినిమాల తర్వాత అంజలి మరీ లావుగా తయారై ఎబ్బెట్టుగా కనిపించింది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఐతే కొన్ని నెలలుగా అంజలిలో మార్పు కనిపిస్తోంది. ఆమె అదనపు క్యాలరీలు తగ్గించుకోవడానికి కష్టపడుతున్న విషయం తన బాడీలో ప్రతిఫలించింది.అంజలి కృషి ఫలించి ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయిందామె. తాజాగా అద్దం ముందు నిలబడి అంజలి తీసుకున్న సెల్ఫీ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అవి చూసి జనాలు షాకైపోతున్నారు. ఓవరాల్ గా బాడీలో చాలా మార్పు కనిపిస్తోంది. అసలు ఈమె అంజలియేనా అన్న సందేహం కలుగుతోంది. నడుం భాగంలో వచ్చిన మార్పు మరింత షాకిచ్చే విషయమే. మొత్తానికి అంజలి కెరీర్ ముగిసిందనుకుంటున్న టైంలో ఇంత మార్పు చూపించడం ఆశ్చర్యకరం. చాన్నాళ్ల తర్వాత తెలుగులో ‘గీతాంజలి’ సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అంజలి.. ఆ చిత్రం కోసమే ఇంతలా సన్నబడిందో.. లేక క్యాజువల్ గానే మార్పు చూపిస్తోందో గానీ..  కారణమేదైనా ఈ మార్పు మాత్రం మంచికే అనడంలో సందేహం లేదు.