ఫోటో స్టోరీ: సూపర్ సెక్సీ అంజలి

Tue Jun 19 2018 12:39:43 GMT+0530 (IST)

చాలామంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో స్లిమ్ గా.. సెక్సీగా ఉండి.. ఏళ్లు గడిచేకొద్దీ షేప్ ఔట్ అయిపోతుంటారు. కానీ అంజలి మాత్రం ఇందుకు భిన్నమైన దారిలో సాగుతోంది. ఈ అమ్మాయి కెరీర్ ఆరంభం నుంచి బొద్దుగానే కనిపిస్తోంది. ఎప్పుడూ కూడా బరువు తగ్గేప్రయత్నమే చేయలేదు. తమిళ ప్రేక్షకులకు కొంచెం నిండుగా ఉంటేనే ఇష్టం. వాళ్ల అభిరుచికి తగ్గట్లే బొద్దుగా కనిపించేది అంజలి ఎప్పుడూ. ఆమెకు వచ్చే పాత్రలు కూడా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ కావడంతో షేపులు మార్చుకోవాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది. కానీ కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఆమె ఒక్కసారిగా రూపం మార్చేసింది.ఈ మధ్య బాగా సన్నబడి గ్లామర్ హీరోయిన్లకు దీటుగా తయారైంది. అంజలి పుట్టిన రోజు సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన ‘గీతాంజలి-2’ ఫస్ట్ లుక్ లో అంజలి ఎంత సెక్సీగా కనిపించిందో తెలిసిందే. తర్వాతి రోజు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్లకు థ్యాంక్స్ చెబుతూ అంజలి ఒక పిక్ షేర్ చేసింది ట్విట్టర్లో. అందులో మరింత సూపర్ సెక్సీగా కనిపిస్తోంది అంజలి. దశాబ్దం పాటు సాగిన కెరీర్లో అంజలి ఎప్పుడూ ఇంత గ్లామరస్ గా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. అంజలి అసలు ఇలాంటి డ్రెస్ వేయడానికి అనుకూలంగా ఆమె బాడీ ఉండేది కాదు. ఐతే ఒంట్లోని అదనపు కేలరీలన్నీ తగ్గించుకుని.. గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగా తయారైన అంజలి.. నెటిజన్లకు పెద్ద షాకే ఇచ్చింది. మరి ఈ అవతారంతో అంజలి మున్ముందు కొత్తగా ఎన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.