Begin typing your search above and press return to search.

నేనా చెంపదెబ్బ కొట్టడమా- అంజలి

By:  Tupaki Desk   |   5 Aug 2015 9:31 AM GMT
నేనా చెంపదెబ్బ కొట్టడమా- అంజలి
X
అంజలి కోలీవుడ్ లో నటిగా ఎంత మంచి పేరు తెచ్చుకుందో వివాదాలతోనూ అంతే ఫేమస్ అయింది. కెరీర్ యమ స్పీడు మీద ఉండగా వివాదాలు వెంటాడి.. చాలా అవకాశాలు కోల్పోయిన అంజలి దాదాపు రెండేళ్లు తమిళ సినీ పరిశ్రమకు దూరమైంది. మళ్లీ ఈ మధ్యే అక్కడ నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. ఐతే మన తెలుగమ్మాయిని అక్కడి జనాలు ఊరికే అనవసర వివాదాల్లోకి లాగుతూనే ఉన్నారు. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో అంజలి నటిస్తున్న ‘ఇరైవి’ సినిమా షూటింగ్ సందర్భంగా ఎస్.జె.సూర్య బర్త్ డే పార్టీ లో ఓ అటెండర్ చెంప చెల్లుమనిపించిందంటూ ఓ రూమర్ ఈ మధ్య హల్ చల్ చేసింది. అంతే కాదు.. అంజలికి ఓ ఎన్నారై తో రొమాన్స్ చేస్తోందని.. దీని కోసం తరచుగా అమెరికా వెళ్తుంటుందని కూడా వార్తలు పుట్టించారు.

ఈ రూమర్ల పై మొన్నటిదాకా అంజలి సైలెంటుగానే ఉంది. ఐతే సైలెంటుగా ఉండే కొద్దీ కొత్త రూమర్లు పుడుతుండటంతో ఈ మధ్య మీడియా ముందుకొచ్చి ఆ రూమర్ల పై క్లారిటీ ఇచ్చింది. ‘‘నా గురించి వస్తున్న వార్తలు చదివి నవ్వుకున్నా. నేను ఎస్.జె.సూర్య పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మాట వాస్తవం. కానీ నేనక్కడ ఎవరినీ కొట్టలేదు. నా సినిమా షూటింగుల కోసమే అమెరికా వెళ్తుంటా తప్ప ఎవరినీ కలవడానికి కాదు. తెలుగు సినిమా చిత్రాంగద షూటింగ్ అమెరికా లో కూడా చేస్తున్నారు. నేను హైదరాబాద్ లో ఫ్యామిలీ తో కలిసి ఉంటున్నా. నా మీద ఇలాంటి చీప్ రూమర్ల ను క్రియేట్ చేయకండి’’ అంటూ తమిళ మీడియా వాళ్లకు తలంటి పోసింది అంజలి. తన మీద దర్శకుడు కలాంజియం పెట్టిన కేసుల గురించి మాట్లాడ్డానికి అంజలి నిరాకరించింది.