Begin typing your search above and press return to search.

నా చెల్లెలా.. హీరోయిన్ గానా?

By:  Tupaki Desk   |   1 Sep 2015 11:36 AM GMT
నా చెల్లెలా.. హీరోయిన్ గానా?
X
హీరోలు తమ తమ్ముళ్లను, కొడుకులను హీరోల్ని చేసినట్లే.. హీరోయిన్లకు తమ ఫ్యామిలీ మెంబర్లను సినిమాల్లోకి తీసుకురావాలని ఉంటుంది. గతంలో ఆర్తి అగర్వాల్, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు తమ చెల్లెళ్లను ఇండస్ట్రీలోకి తెచ్చారు. కానీ వాళ్లు తమ అక్కల్లాగా సక్సెస్ కాలేకపోయారు. ఐతే ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిన అంజలి తన చెల్లెలు ఆరాధ్యను ఇండస్ట్రీ లోకి తేబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆరాధ్యను తెలుగులోనే ఓ ప్రముఖ సంస్థ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆరాధ్య ఫొటోలు కూడా మీడియాలో రావడంతో ఈ వార్త నిజమే అనుకున్నారు.

ఐతే అంజలి మాత్రం ఈ వార్తను ఖండించింది. తన చెల్లెలికి పెళ్లయి సంతోషంగా జీవనం సాగిస్తోందని.. ఆమెకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమేదీ లేదని అంజలి స్పష్టం చేసింది. తన చెల్లెలికి ఇంతకుముందు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగిన మాట వాస్తవమే అని.. కానీ ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకుని పెళ్లి చేసుకుందని అంజలి చెప్పింది. ఇక అంజలి కెరీర్ విషయానికొస్తే ఇటు తెలుగులో, అటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రాజోలు పిల్ల. తెలుగులో డిక్టేటర్, చిత్రాంగద, శంకరాభరణం సెట్స్ మీద ఉండగా.. తమిళంలో ఇరైవి, తారామణి అనే సినిమాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి.