Begin typing your search above and press return to search.

అయ్యో అంజలి..ఐటెమ్ కూడా ఊపు ఇవ్వలేదే!!

By:  Tupaki Desk   |   29 April 2016 1:30 PM GMT
అయ్యో అంజలి..ఐటెమ్ కూడా ఊపు ఇవ్వలేదే!!
X
తెలుగమ్మాయే అయినా తమిళ్ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుని.. టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో అంజలి పోషించిన పాత్రతో.. ఈమె దశ తిరిగినట్లే అనుకున్నారంతా. కానీ అమ్మడి ఫిజిక్ కారణంగా ఆశించిన స్థాయి ఆఫర్లు మాత్రం రాలేదు. దీనికి తోడు కెరీర్ కీలక దశలో చేసిన తప్పులు కూడా వెంటాడాయి. తర్వాత వాటిని సరి చేసుకుని గీతాంజలితో సక్సెస్ సాధించిన.. అంజలి ఫేట్ మాత్రం మారలేదు.

దీంతో డేరింగ్ డెసిషన్ తీసుకుని ఐటెం సాంగ్ కు సై అనింది అంజలి. రీసెంట్ గా విడుదలైన సరైనోడు మూవీలో అంజలి ఓ ఐటెంసాంగ్ చేసింది. ఈ పాటలో డ్యాన్సులు చేసేందుకు అంజలి ఒప్పుకోగానే.. బోలెడంత ఇంట్రెస్ట్ మొదలైంది. దీనికి కారణం.. అల్లు అర్జున్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు తెగ క్రేజ్ ఉండడమే. మామూలుగానే మ్యూజికల్ హిట్స్ ఇచ్చే ఈ హీరో.. ఐటెం సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అందుకే చాలామంది ఐటెం భామలకు అల్లు అర్జున్ సినిమాల్లో నటించాక కెరీర్ ఊపందుకుంటుంది. ఇదే రేంజ్ లో అంజలికి కూడా ఈ ఐటెం సాంగ్ ప్లస్ అవుతుందని ఊహించారు.

టీజర్ రిలీజ్ తర్వాత ఈ హోప్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పుడు సినిమా వచ్చేసింది.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కానీ.. అంజలికి కలిసొచ్చిందేమీ కనిపించడం లేదు. దీనికి కారణం.. ఆన్ స్క్రీన్ పై ఈమెను అంతగా ఫోకస్ చేయక పోవడమే. ఐటెం సాంగ్ చేసినా అవకాశాలు మాత్రం అంజలి తలుపు తట్టడం లేదు. పాపం అంజలి అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.