Begin typing your search above and press return to search.

అంజ‌లికి మ‌ళ్లీ దెయ్యం ప‌ట్టింది

By:  Tupaki Desk   |   21 May 2018 7:27 AM GMT
అంజ‌లికి మ‌ళ్లీ దెయ్యం ప‌ట్టింది
X
తెలుగు భామే అయినా త‌మిళంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది అంజ‌లి. కోలీవుడ్ లో పాగా వేశాక ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ చిత్రంలో సీత‌లా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ఆమె చేసిన ‘గీతాంజ‌లి’ సినిమా కూడా బాగానే ఆక‌ట్టుకుంది. హ‌ర్ర‌ర్ జోన్ త‌న‌కి బాగా సెట్ అయ్యినట్టు ఫిక్స్ అయిన ఈ భామ ‘చిత్రాంగ‌ద‌’ అంటూ వ‌చ్చినా హిట్టుకొట్టలేక‌పోయింది. ఇప్పుడు మ‌ళ్లీ ఇంకో హ‌ర్ర‌ర్ సినిమాలో న‌టిస్తోంది అంజ‌లి.

అయితే ఇది మామూలు హ‌ర్ర‌ర్ మూవీ కాదు. 3డీ హ‌ర్ర‌ర్ ఫిల్మ్. ‘లిసా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు- త‌మిళ భాష‌ల్లో రూపొంది హిందీలోకి కూడా డ‌బ్ చేయ‌బోతున్నారు. అన్నీ హ‌ర్ర‌ర్ చిత్రాల్లా ఓ పాడుబ‌డ్డ బంగ్లా... అందులో దెయ్యాలు... రివెంజ్ యాంగిల్... ఇలాంటి రోటీన్ క‌థాంశంతో కాకుండా స‌రికొత్త కాన్సెప్ట్ తో రూపొంద‌బోతున్న‌ద‌ని చెబుతున్నారు చిత్ర బృందం. ప్ర‌ముఖ త‌మిళ‌ సినిమాటోగ్రాఫ‌ర్ క‌మ్ ద‌ర్శ‌కుడు పీజీ ముత్తయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు రాజు విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నాడు. రాజువిశ్వ‌నాథ్ చాలా తెలుగు సినిమాల‌కి ర‌చ‌నా స‌హాకారం అందించారు. ఈ సినిమాపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లెట్టేసింది చిత్ర బృందం.

‘మ‌నం’ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తో కూడా క‌లిసి ప‌నిచేశారు. ‘తెలుగు- త‌మిళ భాష‌లు రెండూ తెలిసిన హీరోయిన్ కావాల‌నే ఉద్దేశంతోనే అంజ‌లిని ఎంపిక చేశాం. అన్ని సినిమాల్లోలా అమాయ‌క‌త్వంతో ప‌ద్ధతిగా కాకుండా ఈ సినిమాలో గ్లామ‌ర‌స్ గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ అంజ‌లిని చూడ‌బోతున్నారు’ అంటున్నాడు ద‌ర్శ‌కుడు. అంజ‌లి గ్లామ‌ర‌స్ యాంగిల్ అంటే యూత్ లో క్యూరియాసిటీ పెర‌గ‌డం గ్యారెంటీ!