చీరకట్టులో సీతమ్మ బాగుందే

Mon Apr 16 2018 14:42:03 GMT+0530 (IST)

తెలుగమ్మాయే అయినా తమిళంలో ఎక్కువగా క్లిక్ అయ్యింది అంజలి. ఆరంగ్రేటం ఇక్కడి నుంచే చేసినా... అమ్మడికి అక్కడే వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పుడూ ఆమె చేతిలో నాలుగు కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయంటే ఈ తెలుగందం... తమిళులకి ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బొద్దుగా ముద్దుగా ఉండే అంజలి... ఈ మధ్యే బరువు తగ్గి స్లిమ్ లుక్ లో దర్శనమిస్తోంది.తాజాగా పసుపు రంగు చీరను అందంగా సింగారించుకుని ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అంజలి. అంజలి చీరకట్టడం కొత్తేమీ కాదు.  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అంతా చీరకట్టులోనే కనిపిస్తుంది అంజలి. అయితే అప్పుడు ఈ సీతమ్మ బొద్దుగా చీరలో ముద్దుగా ఉండేది. ఇప్పుడు స్లిమ్ లుక్ లో నాజుకు నడుముతో మెరుపు తీగలా మెరిసిపోతోంది అంజలి. ఇన్నాళ్లు సీనియర్ హీరోల సరసనే ఎక్కువ అవకాశాలు అందుకున్న అంజలి కోసం ఇప్పుడు కుర్ర హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ హీరో జైతో లవ్ ‘జర్నీ‘’ చేసిన అంజలి... కొద్ది కాలంగా అతనితో సహజీవనం చేస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే జై నాకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటూ రొటీన్ కబుర్లే చెబుతోంది ఈ రాజోలు పిల్ల.  

ప్రస్తుతం అంజలి... మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టీతో చేసిన ‘పెరంబు’ మే 4న విడుదలవుతోంది.  కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలోనూ ఎంపికైంది. వీటికి భిన్నంగా  తెలుగులో గుంటూర్ టాకీస్ 2లో నటించేందుకు అంగీకరించింది. ఎప్పుడూ పద్ధతిగా ఉండే అంజలి...ఈ సినిమాలో యమా హాట్ గా కనిపించబోతుందని సమాచారం.