ఆకాశపు అంచుల్లో.. మొగుడితో అలా..

Thu Sep 14 2017 13:42:07 GMT+0530 (IST)

నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచేసుకున్న హీరోయిన్ గుర్తుందా? అయినా అమ్మడిది మర్చిపోయే అందమేనా.. పెదవి పైనే చిన్న పుట్టుమచ్చతో అమాయకపు చూపులతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన భామ ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చేసి భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అప్పట్లో టాలీవుడ్ యువ హీరోల సినిమాల్లో రొమాన్స్ చేసిన ఈ భామ అంతగా పాపులర్ అవ్వలేదు.

ఎందుకో ఏమో గాని చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యింది. ఇక సీరియల్స్ అయితే అమ్మడు బాగానే నటించింది. ఓ వైపు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే హిందీ పాపులర్ సీరియల్స్ లో నటించేది. ఇక ఆ తర్వాత అమ్మడు ఏమనుకుందో గాని సడన్ గా బికినిలో దర్శనమిచ్చింది. అల్లరి నరేష్ అహ నా పెళ్ళంట సినిమాలో బికినీ వేసుకొని కనిపించి అందరిని షాక్ కి గురి చేసింది. అలాగే హిందీ సినిమాల్లో గ్లామర్ వయ్యారాలను బాగేనా వలకబోసింది. ఇక అసలు విషయానికి వస్తే అనిత 2013 లో కాస్త సినిమాలను పక్కనపెట్టి రోహిత్ రెడ్డి అనే తెలుగు బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

ప్రస్తుతం అమ్మడు ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా జీవసిస్తోంది అప్పుడపుడు కొన్ని షోలలో మెరుస్తున్న గ్లామర్ షోలను పూర్తిగా తగ్గించేసింది. ప్రస్తుతం స్విట్జర్ ల్యాండ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ప్యారా గ్లైడింగ్ తో ఆకాశపు అంచుల్లో ఎగురుతూ దిగిన ఓ ఫోటోను అమ్మడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆమె అభిమానులు చాలామంది చాలా మిస్ అవుతున్నట్లు కామెంట్  చేశారు. మొత్తానికి అనిత అయితే ప్రస్తుతం భర్తతో హ్యాపీగా ఉంది.