ఈ నగరం అయినా ఆమెకు హిట్టిస్తుందా?

Thu Jun 21 2018 10:52:59 GMT+0530 (IST)

ఈ నగరానికి ఏమైంది అంటూ పెళ్లి చూపులు ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన సినిమా ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. పెద్ద హీరోలతో మూవీ చేసే అవకాశం వచ్చినా.. రెండో ప్రయత్నంలో కూడా కొత్తవాళ్లతో సింపుల్ ప్రయత్నాన్నే చేశాడు తరుణ్. ఈ సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తోంది అనీషా ఆంబ్రోస్.ఈ భామ టాలీవుడ్ లో చాలాకాలంగానే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. చివరకు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కూడా నిరుత్సాహపరిచింది. ఇప్పుడు మాత్రం ఈ నగరానికి ఏమైంది మూవీతో తనకు తరుణ్ భాస్కర్ అయినా బ్రేక్ ఇస్తాడని హోప్స్ పెట్టుకుంది అనీషా. పెళ్లిచూపులు మూవీతో రీతువర్మకు క్రేజ్ వచ్చినట్లే.. తనకు కూడా దక్కుతుందని ఆశిస్తోంది. ఈ నెల 29న విడుదల కానున్న ఈ మూవీ ప్రచారంలో తెగ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది అనీషా ఆంబ్రోస్.

'సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గతంలో నేను గోపాలా గోపాలా చిత్రంలో చిన్న పాత్రలో నటించాను. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది మూవీలో పూర్తి స్థాయి రోల్ ను ఇచ్చారు. ఇలాంటి టీంతో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ తో పాటు.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా' అని చెబుతోంది అనీషా ఆంబ్రోస్.