Begin typing your search above and press return to search.

కదిలే కాలం కుర్రాడికి కాలం కలిసొచ్చేనా!!

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:44 AM GMT
కదిలే కాలం కుర్రాడికి కాలం కలిసొచ్చేనా!!
X
రీసెంట్ గా విడుదల అయిన మ్యూజిక్ వీడియో 'కదిలే కాలం కలలా ' అందరినీ ఆకట్టుకుంటోంది. లవ్ బ్లోసమ్స్ థీమ్ తో రూపొందిన ఈ పాట చూసిన ప్రతీ ఒక్కరి హృదయాలను తట్టి లేపుతోంది. ఈ పాటలో నటించిన అనిరుధ్ సమీర్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది.

'దర్శకుడు కిరణ్ మీగడ నాకు కొంతగా తెలుసు. ఈ మ్యూజిక్ వీడియో చేయమని అడిగినపుడు నేను వెంటనే అంగీకరించలేదు. కానీ ట్రాక్ విన్న తర్వాత ఈ ప్రాజెక్టులో భాగం అయిపోయా' అని చెప్పాడు సమీర్. ఈ మ్యూజిక్ వీడియో ప్రీ ప్రొడక్షన్.. పోస్ట్ ప్రొడక్షన్ లకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. షూటింగ్ పార్ట్ మొత్తం 14 గంటల్లోనే పూర్తి చేసేశారట. ఈ ప్రాజెక్టు కోసం ముందునుంచే చాలానే ప్లానింగ్ చేయడం కారణంగానే ఇది సాధ్యమైన్నాడు అనిరుధ్ సమీర్. దర్శకుడు కిరణ్ మీగడ.. సినిమాటోగ్రాఫర్ కళ్యాణ్ శామ్ ల మధ్య మంచి సమన్వయం ఉందని చెప్పాడు.

'నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్ డ్రామాల్లో కూడా యాక్ట్ చేశాను. వెబ్ సిరీస్.. షార్ట్ ఫిలిమ్స్.. టీవీ కమర్షియల్స్ లో నటించాను. ఫ్రీ స్టైల్.. హిప్ హాప్ డ్యాన్సులలో ట్రైనింగ్ తీసుకున్నా. అలాగే ఫిట్నెస్ అంటే మహా ఇష్టం. కిక్ బాక్సింగ్ రోజూ ప్రాక్టీస్ చేస్తాను' అన్న సమీర్.. ఇప్పుడు కొంతమంది ఫిలిం మేకర్స్ సినిమాల్లోకి అడుగుతున్నారని.. ఇప్పుడే ప్రాజెక్టు సంగతి చెప్పకపోయినా.. త్వరలో వెండితెరపై కనిపించబోతున్నానని అన్నాడు అనిరుధ్ సమీర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/