నానికి బాగా నచ్చినట్లున్నాడుగా

Tue Feb 19 2019 12:05:11 GMT+0530 (IST)

చిన్న వయస్సులోనే సంగీతంలో సంచలనాలు సృష్టించిన సంగీత దర్శకుడు అనిరుథ్ తమిళనాట స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలుగుతున్నాడు. తమిళ సంగీత దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా కాలం నుండే వస్తుంది. తెలుగు నుండి చాలా ఆఫర్లు వచ్చినా కూడా వాటిని కాదని ప్రతిష్టాత్మక పవన్ త్రివిక్రమ్ మూవీ 'అజ్ఞాతవాసి' తో టాలీవుడ్ లోకి అనిరుథ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆకట్టుకోలేక పోయింది. దాంతో త్రివిక్రమ్ తర్వాత సినిమాకు పని చేసే అవకాశం కోల్పోయాడు. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో అనిరుథ్ మళ్లీ టాలీవుడ్ లో అడుగు పెట్టక పోవచ్చు అంటూ అంతా అనుకున్నారు. కాని నాని 'జెర్సీ' చిత్రంతో ద్వితీయ ప్రయత్నాన్ని చేస్తున్నాడు.'జెర్సీ' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటికే అన్ని పాటలు కూడా పూర్తి అయ్యాయట. అనిరుథ్ ఇచ్చిన పాటలు నానికి బాగా నచ్చినట్లున్నాయి. అందుకే అనిరుథ్ ను తన తర్వాత సినిమాకు కూడా నాని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లబోతుంది. మరో వైపు విక్రమ్ తో కూర్చుని నాని కోసం అనిరుథ్ ట్యూన్స్ ను రెడీ చేస్తూనే ఉన్నాడట. తమిళంలో సంచలన సంగీత దర్శకుడిగా నిరూపించుకున్న అనిరుథ్ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు వారితో అనిరుథ్ మంచి సంగీత దర్శకుడు అనిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నాని 'జెర్సీ' మూవీ మరియు విక్రమ్ కుమార్ మూవీలు మ్యూజిక్ పరంగా మంచి మార్కులు దక్కించుకుంటే టాప్ స్టార్స్ కూడా అనిరుథ్ తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మరి అనిరుథ్ ద్వితీయ విఘ్నాన్ని దాటుతాడా అనేది చూడాలి.