నాని పాటకు హీరోయిన్ ప్రియుడి లిరిక్స్

Tue Feb 12 2019 20:00:01 GMT+0530 (IST)

న్యాచురల్ స్టార్ నాని నటించిన క్రికెట్ బేస్డ్ మూవీ జెర్సీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాలో నాని నటించడం ఇద్ రెండో సారి. కెరీర్ ప్రారంభంలో భీమిలి కబడ్డీ జట్టు చేసాడు కానీ అది రీమేక్. మళ్ళి రావా తో సుమంత్ కు మంచి కం బ్యాక్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని టేకప్ చేయడం ఇప్పటికే ఆసక్తి రేపింది. రేపు వాలెంటైన్ డే సందర్భంగా ఫస్ట్ ఆడియో సింగల్ విడుదల చేయబోతున్నారు.అయితే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన అనిరుద్ రవి చందర్ రెండో సినిమా ఇది. దానికన్నా విశేషం మరొకటి ఉంది. జెర్సి తమిళ్ లో కూడా వస్తోంది. అనిరుద్ కు అక్కడ భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ ఆల్బమ్ అక్కడివారికి త్వరగా రీచ్ అయిపోతుంది. రేపు రిలీజ్ చేయబోయే పాట ప్రత్యేకత ఏంటంటే తమిళ్ లో మరక్కావిలయే అంటూ సాగే ఈ పాటను రాసింది దర్శకుడు విజ్ఞేశ్ శివన్. పరిచయం పెద్దగా అక్కర్లేదు కానీ నయనతార లవర్ గా సూర్య గ్యాంగ్ దర్శకుడిగా మనకూ సుపరిచితుడే. మొదటిసారి అతను లిరిక్స్ రాసిన పాట ఇది.

ఈ రకంగా కూడా ఇది ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేమికుల రోజున తమ పాటను ఎంజాయ్ చేయమని అనిరుద్ ప్రత్యేకంగా ట్వీట్ చేసాడు. విక్రమ్ వేదాతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా శ్రీనాధ్ జెర్సిలో హీరోయిన్ కావడం మరో ప్లస్ గా నిలుస్తోంది. తమిళ్ లో మార్కెట్ కోసం నాని ఎప్పటి నుంచో కన్నేశాడు. భలే భలే మగాడివోయ్ లాంటి హిట్స్ అన్ని అక్కడ రీమేక్ అయ్యాయి కాబట్టి ఛాన్స్ దొరకలేదు. ఈసారి జెర్సితో కొడితే కోలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు