Begin typing your search above and press return to search.

#మీటూ : సెలబ్స్‌ మేనేజర్‌ ఆత్మహత్య యత్నం

By:  Tupaki Desk   |   20 Oct 2018 9:08 AM GMT
#మీటూ : సెలబ్స్‌ మేనేజర్‌ ఆత్మహత్య యత్నం
X
బాలీవుడ్‌ ను మీటూ ఉద్యమం కుదిపేస్తున్న నేపథ్యంలో ఎంతో మంది స్టార్స్‌ - సెలబ్రెటీలు తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు మంచి వారిగా ఉన్న సెలబ్రెటీలు ఇప్పుడు కొందరు చేస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో పరువు పోగొట్టుకుని తల దించుకుంటున్నారు. మరి కొందరు మాత్రం పరువు నష్టం దావాలు అంటూ కోర్టుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ స్టార్స్‌ మేనేజర్‌ అంర్బన్‌ దాస్‌ బ్లాప్ ఆత్మహత్యాయత్నం చేయడం ప్రస్తుతం బాలీవుడ్‌ లో సంచలనంకు తెర లేపింది.

ఈయన పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ తో పాటు సౌత్‌ కు చెందిన స్టార్స్‌ తో కూడా డీలింగ్స్‌ పెట్టుకుని - వారి డేట్లు చూడటంతో పాటు - వారి కమర్షియల్‌ యాడ్స్‌ ఒప్పందాలను చూస్తూ ఉంటాడు. సెలబ్స్‌ మేనేజ్‌ మెంట్‌ సంస్థకు అంర్బన్‌ దాస్‌ కో ఫౌండర్‌ గా ఉన్నాడు. ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్‌ తో సన్నిహిత సంబంధాలున్న ఈయన తాజాగా పలువురి నుండి లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్నాడు. ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడంటూ ఈయన్ను మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు మోడల్స్‌ మరియు నటీమణులు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అంర్బన్‌ దాస్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ముంబయిలోని పాత వాషి బ్రిడ్జ్‌ పై నుండి ఈయన దూకేందుకు ప్రయత్నించాడు. అయితే ఈలోపు పోలీసులు అక్కడకు చేరుకుని ఆయన్ను కాపాడారు. పోలీసులు ఆయన్ను స్టేషన్‌ కు తరలించారు.

ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి వాషి బ్రిడ్జ్‌ పై నుండి దూకబోతున్నాడంటూ సమాచారం వచ్చింది. వెంటనే మేము అక్కడకు చేరుకున్నాం. అప్పటికే ఆయన బారీ కేడ్స్‌ ను ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాము స్పీడ్‌ గా అక్కడకు చేరుకుని ఆయన్ను కిందకు దించాం. ప్రస్తుతం ఆయన చాలా వీక్‌ గా ఉన్నాడు, అదే పనిగా ఏడుస్తూ ఉన్నాడు. ఆయన భార్యకు విషయాన్ని తెలియజేశాం. ఆయన చాలా డిప్రెషన్‌ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్‌ కు గత కొన్ని రోజులుగా ఆయన దూరంగా ఉంటున్నట్లుగా కూడా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మీటూ ఉద్యమం వల్ల పరువు పోగొట్టుకుని కుటుంబం ముందు, ఇండస్ట్రీలో తిరుగలేక ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.