గూఢచారి అమ్ముడైపోయాడు..ఎవరికో తెలుసా?

Tue Jul 17 2018 22:45:14 GMT+0530 (IST)

విడుదలకి ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకున్నాడు గూఢచారి. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శన కోసం  ఔట్ రేట్ కి కొనేశారు.  ఓవర్సీస్ తో పాటు - హిందీ రైట్స్ కూడా అమ్మేశారు. ఈ బిజినెస్ తోనే నిర్మాత సినిమాకి పెట్టిన 7 కోట్లు తిరిగొచ్చేశాయట. ఇక శాటిలైట్ రైట్స్ - డిజిటల్ రైట్స్ - మిగిలిన ఇతర ప్రాంతాలకి సంబంధించిన రైట్స్ నిర్మాతల దగ్గరే ఉన్నాయి. ఈ లెక్కన ఏ రకంగా చూసినా సినిమాకి మంచి ప్రాఫిటే. ఆగస్టు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మంచి ప్రమోషన్స్ తో సినిమాని విడుదల చేసుకుంటే సినిమాకి మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న చిత్రబృందం ఆ విషయంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.`క్షణం` తర్వాత అడవి శేష్  కథతో రూపొందిన చిత్రమిది. శశికిరణ్ దర్శకుడు. అడవిశేష్ కథానాయకుడిగా రూపొందిన ఈచిత్రంలో తెలుగమ్మాయి - ప్రముఖ మోడల్ శోభిత దూలిపాళ కథానాయికగా నటించింది. ఆమె హాట్ హాట్ అందాలతో లిప్ కిస్సులతో అదరగొట్టిందని  ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమైంది. టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో నాగార్జున మేనకోడలు - సుమంత్ సోదరి సుప్రియ ఓ కీలక పాత్ర పోషించింది.