Begin typing your search above and press return to search.

వాళ్ల వెండి కాయిన్.. వీళ్ల లక్కీ కూపన్

By:  Tupaki Desk   |   27 Sep 2016 3:30 PM GMT
వాళ్ల వెండి కాయిన్.. వీళ్ల లక్కీ కూపన్
X
ఈ మధ్యన సినిమాలను జనాలకు చూపించడానికి స్కీములు కూడా పెట్టేస్తున్నారు తెలుగు నిర్మాతలు. సినిమాలో కంటెంట్ కు తగినట్లే.. ఏదో ఒక స్కీమ్ పెట్టడం.. సినిమాకు రండి గిఫ్టు పట్టండి అనడం సాధారణమైపోయింది. ఆ మధ్యన 'సైజ్ జీరో' సినిమా చూసి ఆ టిక్కెట్ పైన ఉన్న నెంబర్ ను ఎసెమ్మెస్ చేస్తే.. ఆ నెంబర్లను డ్రా తీసి ఆ లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం అన్నారు.

ఇప్పుడు 'హైపర్' నిర్మాతలు కూడా అదే స్కీము ఒకటి పెట్టారు. ఈ సినిమాలో హీరో రామ్ అండ్ తమిళ నటుడు సత్యరాజ్ తండ్రీ-కొడుకులుగా నటిస్తున్నారు. అందుకే సినిమా ధియేటర్లకు తండ్రీ అండ్ కొడుకు కలసి వస్తే వారికి ఒక కూపన్ ఇస్తారట. అలా వ‌చ్చిన కూప‌న్స్ లో డ్రా తీసి గెలిచినవాళ్ల‌కు చ‌దువుకునేందు గాను 5 ల‌క్ష‌లు అంద‌చేయ‌నున్నాం అంటున్నాడు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర్. గతంలో ఇలాంటి డ్రా లు పెట్టిన ఏ ఒక్క సినిమా వారు కూడా అసలు సదరు డ్రా కండక్ట్ చేసి ప్రైజులు అందజేసిన దాఖలాలే లేవు. మరి ఇప్పుడు హైపర్ మేకర్లయినా ఈ లక్కీ కూపన్ ఏదో నిజంగానే అందిస్తారా అనేదే చూడాలి.

సంతోష్‌ శ్రీనివాస్ డైరక్షన్లో రూపొందిన హైపర్ సినిమాలో రామ్ తన ఎనర్జీతో టాలెంట్ చూపిస్తుంటే.. రాశి ఖన్నా తన అందాల దాటితో షాకిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/