Begin typing your search above and press return to search.

నెంబర్ 5 లోడింగ్ అంటున్న అనిల్ రావిపూడి

By:  Tupaki Desk   |   19 March 2019 6:42 AM GMT
నెంబర్ 5 లోడింగ్ అంటున్న అనిల్ రావిపూడి
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా 'మహర్షి' మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ టేకప్ చేయబోయే ప్రాజెక్టుపై కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ ఇప్పుడు అది పూర్తిగా తొలగిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు మహేష్ సిద్ధం అవుతున్నాడట. అనిల్ ప్రస్తుతం స్క్రిప్ట్ ను ఫైన్ ట్యూనింగ్ చేస్తూ పకడ్బందీగా రూపొందిస్తున్నాడట.

ఈ ప్రాజెక్టు గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్న సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. "ఇప్పుడు.. నంబర్ 5( ఒక రైటింగ్ ఎమోజి.. క్లాప్ బోర్డు ఎమోజి) లోడింగ్.. (సూపర్ ఎమోజి స్టార్ ఎమోజి.. రెండు ఫైర్ ఎమోజిలు ) సూన్" అంటూ ట్వీట్ చేశాడు. అర్థం అయింది కదా? ప్రస్తుతం రైటింగ్ జరుగుతోందని త్వరలో క్లాప్ కొడతామని.. సూపర్ స్టార్ సినిమా లోడింగ్ అంటూ క్లారిటీ ఇచ్చేసినట్టే. అనిల్ ఇప్పటివరకూ 'పటాస్'.. 'సుప్రీమ్'.. 'రాజా ది గ్రేట్'.. 'F2' లతో నాలుగు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు టేకప్ చేయబోయేది ఐదవ చిత్రం. ఏకంగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ ట్వీట్ కు నెటిజనుల నుండి భారీ స్పందన దక్కుతోంది. ఈ సినిమాను దిల్ రాజు - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తారని టాక్. ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ఒక హీరోయిన్ గా ఇప్పటికే రష్మిక ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే #మహేష్26 సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు.