ఈ ఇంగ్లిషు పేర్ల గోలేంటి రాజా

Mon Feb 18 2019 13:32:39 GMT+0530 (IST)

ఎఫ్2తో టాలీవుడ్ లో అదిరిపోయే హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదికి ఇదే పెద్ద హిట్. రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద హిట్ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో.. అనిల్ రావిపూడికి ఫుల్లుగా అవకాశాలు వస్తున్నాయి. అయితే.. అనిల్ మాత్రం సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా చేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇన్నాళ్లు అనిల్ రావిపూడి సక్సెస్ పుల్ డైరెక్టర్. మహేశ్ తో సినిమా చేసి స్టార్ డైరెక్టర్ అన్పించుకోవాలన్నదే అనిల్ ఆశ. అందుకే.. మహేశ్ సినిమాకు సంబంధించి ఫిల్మ్ చాంబర్ లో ఆల్ రెడీ వాట్సాప్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు.
      
టైటిల్ బాగానే ఉంది కానీ.. ఈ ఇంగ్లిషుపై మమకారం ఏంటి రాజా అని అందరూ విమర్శిస్తున్నారు. అనిల్ సినిమాల్ని మొదటి నుంచి గమనిస్తే.. అన్నీ ఇంగ్లిషు పేర్లే. పటాస్ - సుప్రీమ్ - రాజా ది గ్రేట్ - ఎఫ్ 2… ఇలా అన్నీ ఇంగ్లిషు పేర్లే పెట్టాడు. అయితే తాను ఇంతవరకు కావాలని ఇంగ్లిషు పేర్లు పెట్టలేదని.. కాకతాళీయంగా జరిగిందని చెప్పాడు. తన నెక్స్ట్ సినిమాకు మాత్రం కచ్చితంగా తెలుగు పేరే పెడతానని రీసెంట్ గా ఒక ఇంటర్యూలో చెప్పాడు. కానీ ఇంతలోనే మాట మార్చేసి వాట్సాప్ అనే ఇంగ్లిషు టైటిల్ ని మహేశ్ కోసం రిజిస్ట్రర్ చేయించాడు. ఇండస్ట్రీలో ప్రతీ డైరెక్టర్ కు కావాల్సింది సక్సెస్. సక్కెస్ ఉన్నప్పుడు దాన్ని సెంటిమెంట్ గా ఫీలయ్యి కంటిన్యూ చేయడమే బెటర్ అని ఫీలైనట్లున్నాడు అనిల్ రావిపూడి.