Begin typing your search above and press return to search.

డైరెక్టర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యా

By:  Tupaki Desk   |   17 Oct 2017 7:12 AM GMT
డైరెక్టర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యా
X
ప్రస్తుత రోజుల్లో సినీ రంగంలో గుర్తింపు పొందాలంటే చాలా కష్టపడాలి. దర్శకులు అవ్వాలని సినీ రంగంలోకి అడుగుపెడుతున్న యువకులు మొదటి అవకాశం దక్కించుకునే సరికి అంకుల్స్ అయిపోతున్నారు. ఆ ప్రయాణాల్లో ఎన్నో అవమానాలు కష్టాలను అనుభవించి చివరకు సినిమాను ఛాన్సును అందుకొని ఈ కాలం దర్శకులు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ తరహాలో ప్రస్తుతం సక్సెస్ గా దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు.

అందరిలాగే మొదట గోస్ట్ రైటర్ గా పనిచేశాడట అనిల్ రావిపూడి. కానీ తనకు మాత్రం అస్సలు గుర్తింపు రాలేదు. మొదట సినిమాల్లోకి రావడం జంధ్యాల గారి సినిమాలే స్ఫూర్తి అని చెబుతున్నాడు. చిన్నప్పుడు స్కూల్లో తిరుపతి ప్రయాణం అనే స్కిర్ట్ తనే డైరెక్ట్ చేసి అందులో ఒక పాత్రను కూడా చేశాడట. ఆ తర్వాత అందరు డైరెక్టర్ అని పివడంతో ఎలాగైనా డైరెక్టర్ అవ్వలని చిన్నతనంలోనే ఫిక్స్ అయ్యాడట. బీటెక్ అయిపోగానే హైదరాబాద్ కు వచ్చి తమ్ముడు సినిమా డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ ని కలిశారట. ఆయన తనకు దగ్గరి బంధువు అని చెబుతూ.. గౌతమ్ ఎస్ఎస్ సి సినిమాతో బిజీగా ఉన్నప్పుడు వెళ్లి కలిస్తే మొదట అవకాశం రాలేదని చెప్పాడు.

కొన్ని రోజుల తర్వాత పిలిచి ఆయన అసిస్టెంట్ గా అవకాశం ఇచ్చారు. చాలా సినిమాలకు గోస్ట్ రైటర్ గా పనిచేశాను కానీ నాకు గుర్తింపు దక్కలేదని చెప్పిన అనిల్ కొద్ది రోజుల్లోనే పటాస్ కథను రాసుకొని చాలా మంది హీరోల చుట్టూ తిరిగానని చెప్పాడు. కానీ ఫైనల్ గా కళ్యాణ్ రామ్ గారు అవకాశం ఇచ్చి నన్ను నమ్మరని అనిల్ చెప్పారు. ఇక తాను బుక్స్ ఏ మాత్రం చదవనని చెబుతూ.. ఎక్కువగా త్రివిక్రమ్ - బాపు గారి సినిమాలను చూసేవాడినని తెలిపాడు.

అనిల్ పటాస్ సినిమా షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ పేపెర్ చేతిలో లేకుండా డైరెక్ట్ చేశాడని ఆ చిత్ర యూనిట్ సభ్యులు చాలా సార్లుచెప్పారు. అంటే.. అనిల్ కు సినిమా అంటే ఎంత ఇష్టమో అర్ధం చేస్తుకోవచ్చు. సెకండ్ మూవీ సుప్రీమ్ తో యావరేజ్ రిజల్ట్ అందుకున్న ఈ యువ దర్శకుడు లేటెస్ట్ గా తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా రేపు రిలీజ్ అవ్వబోతోంది.