Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వైపే చూపంతా

By:  Tupaki Desk   |   23 May 2017 9:54 AM GMT
టాలీవుడ్ వైపే చూపంతా
X
నార్త్, సౌత్ తేడా లేకుండా... హిందీ, తెలుగు అనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో.. అన్నిచోట్ల బాహుబలి ఘన విజయం సాధించింది. రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యానికి సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా పాత రికార్డులను తుడిచిపెట్టేసి ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించింది. దీంతో రాజమౌళిపై ఎందరో ప్రశంసల వర్షం కురిపించారు. ఓ సౌత్ ఇండియా నార్త్ లో కలెక్షన్ల సునామీ సృష్టించినా ఎందుకో బాలీవుడ్ మాత్రం దీనిపై ముందు పెద్దగా స్పందించలేదు.

క్రమంగా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా హిందీ నటుడు అనిల్ కపూర్ బాహుబలి విజయం తర్వాత బాలీవుడ్ మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమే టాలీవుడ్ వైపు చూస్తోందని కితాబిచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో నిజాయతీ, అంకితభావం ఉంటాయని.. ఇవి తనను ఎంతో ఆకట్టుకున్నాయని అంటున్నాడు. దీంతోపాటు తాను నటించిన ఎన్నోసినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ అయ్యాయని... ఇక్కడి సినీ పరిశ్రమతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నాడు.

రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన అనిల్ కపూర్ తన తొలి అడుగులు తెలుగు సినిమాతోనే మొదలెట్టిన విషయం గుర్తు చేస్తున్నాడు, నటుడిగా తాను ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫర్ ఇక్కడే వచ్చిందని చెప్పుకొచ్చాడు . అప్పట్లో బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమాతోనే అనిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.