Begin typing your search above and press return to search.

యాంగ్రీ బర్డ్స్ ఏంది జక్కన్న??

By:  Tupaki Desk   |   28 April 2017 4:37 PM GMT
యాంగ్రీ బర్డ్స్ ఏంది జక్కన్న??
X
''బాహుబలి 2'' మూవీ రిలీజవ్వడంతో ఇక సోషల్ మీడియాలో జనాల కామెడీలు యాజూజువల్ మొదలైపోయాయ్. మనోళ్ళు మాట్లాడితే పంచులు.. ట్వీటేస్తే అరుపులు.. అన్నట్లుంది యవ్వారం. ఇక బాహుబలి 2లో నచ్చిన అంశాలు ఎన్ని చెబుతున్నారో.. కొన్ని అంశాలపై కామెడీలు కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు జక్కన్న క్రియేట్ చేసిన బాహుబలి 2 క్లయ్ మ్యాక్స్ గురించి వినిపిస్తున్న ఆ యాంగ్రీ కామెడీ ఏంటో చూద్దాం పదండి.

నిజానికి మన సినిమాల్లో ఈ మధ్యన ఒక కోట గోడను ఎలా ఎక్కాలి అనే అంశంపై రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. ఆ మధ్యన రుద్రమదేవి సినిమాలో ఒకలా కోట గోడను ఎక్కిస్తే.. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో తాము వాడే కోటగోడ పడగొట్టే యంత్రాలను శత్రువుల గోడపైకి కూలగొట్టి.. వాటిపైనుండి కోట గోడను ఎక్కేస్తారు. ఇప్పుడు బాహుబలి2 లో ఇవి రెండింటికీ దగ్గరగా ఉండకుండా ఏం చేయాలి? అని ఆలోచిస్తే.. రాజమౌళికి ''యాంగ్రీ బార్డ్స్'' గేమ్ గుర్తొచ్చి.. అది కాపీ కొట్టేశాడని జోకులేస్తున్నారు నెటిజన్లు.

యాంగ్రీ బర్డ్స్ సినిమాలో ఒక ఉండేలుకు పక్షని పెట్టి విసిరితే.. అవి వెళ్ళి ఆపోజిట్ ఉన్న పందుల క్యాంపులో పడి వాటిని నాశనం చేస్తాయి. ఇప్పుడు బాహుబలి 2 సినిమాలో అయితే.. ఒక తాటి చెట్టును వంచుకుని.. దాన్ని ఒక ట్రిగ్గర్ లా వాడుకుని.. దానిపై జనాలను నుంచోబెట్టి.. ఆ స్వింగు స్పీడుతో మనోళ్లు కోట గోడపైకి దూకేస్తారు. ఇదంతా అచ్చం యాంగ్రీ బర్డ్స్ గేమ్ లా ఉందంటూ జోకులు పేలుతున్నాయ్. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/