రోగ్ భామకు బోలెడన్ని అవకాశాలు

Tue Mar 21 2017 10:18:18 GMT+0530 (IST)

మోడల్ నుంచి యాక్ట్రెస్ గా మారింది ఎంజెలా క్రిలింజ్కి. పూరీ జగన్నాధ్ రూపొందించిన జ్యోతీ లక్ష్మి చిత్రంతో పరిచయమైన ఈమె.. ఆ తర్వాత సైజ్ జీరోలో కేమియోతో ఆకట్టుకుంది. ఇప్పుడు రోగ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది ఏంజెలా.

రీసెంట్ గా జరిగిన ఆడియో ఫంక్షన్ లో అమ్మడు అదరగొట్టేసింది. ఇది మరో రెండు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టిందని చెబుతోంది ఏంజెలా. రోగ్ ఆడియో మరుసటి రోజే.. తెలుగులో ఓ పెద్ద బ్యానర్ కు.. అలాగే కన్నడ స్టార్ హీరో సుదీప్ పక్కన సైన్ చేసేసింది ఏంజెలా. రోగ్ ఆడియో ఫంక్షన్ లో ఓ పాటకు తన పెర్ఫామెన్స్ చూసి ఈ అవకాశం ఇచ్చారని చెబుతోంది ఏంజెలా. 'నన్ను ఓ అడ్వర్టైజ్మెంట్ లో చేసిన డ్యాన్సింగ్ వీడియోలో చూసి పూరీ నన్ను ఇక్కడకు తీసుకచ్చారు. లాంగ్వేజ్ ఎలాంటి అడ్డం కాబోదని.. ఇప్పటికే నార్త్ భామలు చాలామంది ఇక్కడ సత్తా చాటుతున్నారని ఆయన అన్నారు' అని చెప్పింది ఏంజెలా.

'నిర్మాత సిఆర్ మనోహర్ తన కుమారుడు ఇషాన్ ను పరిచయం చేసే సినిమాలో.. బెంగళూరులో ప్రముఖంగా తెలిసిన అమ్మాయి కోసం వెతుకుతున్నారు. నన్ను ఓ జ్యూవెలరీ బ్రాండ్ యాడ్ లో చూసి అప్రోచ్ అయ్యారు' అంటోంది ఏంజెలా. ఇకపై తెలుగులో వరుసగా సినిమాలు చేస్తానని.. తెలుగు కూడా నేర్చుకుంటున్నానని సంబరంగా చెప్పేస్తోందీమె.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/