Begin typing your search above and press return to search.

థాయ్ సెట్స్‌ లో దొరికిపోయింది

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:28 AM GMT
థాయ్ సెట్స్‌ లో దొరికిపోయింది
X
ప్ర‌స్తుతం డాషింగ్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ చ‌క చ‌కా సినిమాల్ని పూర్తి చేస్తూ కెరీర్ ప‌రంగా దూకుడు పెంచేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికిప్ప‌డు ఇద్ద‌రు కొత్త హీరోల్ని వెండితెర‌కి ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఇటీవ‌లే మ‌హాత్మ నిర్మాత సి.ఆర్‌.మ‌నోహ‌ర్ అన్న కొడుకు ఇషాన్‌ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ మూవీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకి త‌న‌దైన శైలిలో `రోగ్` అనే మ‌రో ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో కొత్త హీరో స‌ర‌స‌న చిరుత ఫేం నేహాశ‌ర్మ సోద‌రి ఐషా శ‌ర్మ క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది.

రోగ్ షూటింగ్ ప్ర‌స్తుతం బ్యాంకాక్ న‌గ‌రంలో సాగుతోంది. నాయ‌కానాయిక‌ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నార‌క్క‌డ‌. అయితే అనూహ్యంగా ఈ మూవీ సెట్‌ లో నీలిక‌ళ్ల సోయ‌గం యాంజెలా క్రిస్కీ సంద‌డి చేసింది. అస‌లు ఈ భామ ఇక్క‌డ సంద‌డి చేస్తోందేంటి? అని ఆరాతీస్తే యాంజెలా రోగ్‌ లో రెండో నాయిక‌గా న‌టిస్తోంద‌ని తెలిసింది. ఆన్‌ సెట్స్ యాంజెలా మానిట‌ర్ చూస్తూ క‌నిపించింది. థాయ్ వీధుల్లో ఇండో పోలిష్ గాళ్‌ తో పూరి సినిమా తెర‌కెక్క‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యాంజెలా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్తేమీ కాదు. ఈ అమ్మ‌డు ఇప్ప‌టికే పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ్యోతిల‌క్ష్మి మూవీలో ఓ అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్‌ తో అల్లాడించింది.

ఇప్పుడు ఏకంగా క‌థానాయిక‌గా ప్ర‌మోట్ అయ్యింది. కొత్త కుర్రాడు ఇషాన్ స‌ర‌స‌న యాంజెలా నాయిక‌గా న‌టించ‌డం ఇంట్రెస్టింగ్. ఈ నీలిక‌ళ్ల సుంద‌రి క్యారెక్ట‌ర్‌ లో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందన‌డంలో సందేహ‌మే లేదు. యాంజెలా అందాలు రోగ్‌ కి క‌లిసొస్తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మొత్తానికి యాంజెలా థాయ్ సెట్స్‌ లో ఇలా దొరికిపోయింది. ఇషాన్ మూవీ కేవ‌లం రెండు నెల‌ల్లో పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న‌ది పూరి ప్లాన్‌.