Begin typing your search above and press return to search.

అందుకే సింగిల్ గా ఉన్నా..!

By:  Tupaki Desk   |   19 Nov 2017 3:46 AM GMT
అందుకే సింగిల్ గా ఉన్నా..!
X
ఆండ్రియా అందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వెండితెర మీద ఆమె అందాల ప్ర‌ద‌ర్శ‌న ప్రేక్ష‌కుల్ని ఎంత‌లా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెర మీద క‌నిపించే ఆండ్రియాకు.. తెర వెనుక కనిపించే ఆండ్రియాకు అస్స‌లు సంబంధం ఉండ‌దు.

చాలామంది హీరోయిన్లు మాట్లాడ‌టానికి భ‌య‌ప‌డే అంశాల్ని ఆండ్రియా ఓపెన్ గా మాట్లాడేస్తుంద‌. అది కూడా అంద‌రూ మాట్లాడినంత ప‌రిమితంగా కాదు. అంద‌రూ చెప్పే ఒక యాంగిల్ కు భిన్నంగా.. ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతుందో అదే య‌థాత‌దంగా మాట్లాడే ద‌మ్ము ఆమె సొంతం. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఆమె ప‌లు అంశాలపై మాట్లాడారు.

తాను కోరుకునే మ‌గాడు ఎలా ఉండాలో చెప్పిన ఆమె.. తానింకా సింగిల్ గా ఉండ‌టానికి కార‌ణం చెప్పేశారు. తెలుగులో త‌ఢ‌కా త‌ర్వాత మ‌రో సినిమాలో క‌నిపించ‌లేదేం? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు.

ఇంత‌కీ.. ఆండ్రియా సింగిల్ గా ఎందుకు ఉన్నార‌న్న ప్ర‌శ్న‌ను వేస్తే.. ఆమె ఇచ్చిన జ‌వాబు ఏమిటంటే.. త‌మ‌కు న‌చ్చిన మ‌గాళ్ల‌ను ఆడావాళ్లు ఎంపిక చేసుకోవ‌టం వారు ఇష్ట‌ప‌డ‌రు. మ‌గాళ్లు దాన్ని భ‌రించ‌లేర‌న్న ఆండ్రియా.. ఆడ‌వాళ్ల‌ను హీనంగా చూడ‌ర‌న్న ఉద్దేశంతో ఒక వ్య‌క్తితో తాను మాట్లాడేదానిన‌ని.. కానీ త‌ర్వాత త‌న‌కు నిరుత్సాహ‌మే ఎదురైంద‌ని చెప్పారు. అత‌డు కూడా ఆడవాళ్ల‌ను హీనంగా చూసేవాడే. ఆడ‌వాళ్ల‌ను త‌మ‌తో స‌మానంగా గౌర‌వించే మ‌గాడు ఒక్క‌డు క‌నిపించ‌లేద‌ని.. అందుకే తాను సింగిల్ గా ఉన్న‌ట్లుగా చెప్పారు.

తెలుగు స్టైయిట్ సినిమా లో (త‌ఢాఖా) మాత్ర‌మే న‌టించారు.. తెలుగు సినిమాలు చేయ‌రా అంటే.. మీ నిర్మాత‌లు.. ద‌ర్శ‌కులు పిల‌వ‌ట్లేద‌న్న మాట‌ను చెప్పిన ఆండ్రియా.. నాకు నేనుగా నాకు అవ‌కాశాలు ఇవ్వండ‌ని ఎవ‌ర్నీ అడ‌గ‌న‌ని తేల్చేశారు. సింగ‌ర్ గా కానీ ఆర్టిస్ట్ గా కానీ ఎవ‌రినీ లైఫ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌సారైనా.. సార్‌.. నాకో ఛాన్స్ ఇవ్వ‌మ‌ని అడ‌గ‌లేద‌ని.. అది త‌న స్ట‌యిల్ అన్న ఆమె.. ఛాన్స్ వ‌స్తే చేస్తాన‌ని లేకుంటే చేయ‌న‌ని వ్యాఖ్యానించారు.