కాస్టింగ్ కోచ్ మీద ఆండ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు

Sun Nov 19 2017 10:11:58 GMT+0530 (IST)

వుడ్ ఏదైనా కానీ.. చిత్ర పరిశ్రమను షాక్ గురి చేస్తున్న కాస్టింగ్ కోచ్ మీద దమ్ముగా మాట్లాడే  వారు చాలా తక్కువగా ఉంటారు. అందుకు అందాల భామ ఆండ్రియా మినహాయింపు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడటమే కాదు.. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న సంకోచం లేకుండా ఫుల్ క్లారిటీతో మాట్లాడే తీరుఆండ్రియాకు ఎక్కువే.కాస్టింగ్ కోచ్ గురించి గతంలో మాట్లాడిన ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లు ఎవరో స్లీప్ చేయాలన్నది వారి ఇష్టం.. వాళ్లను ఫోర్స్ చేసే అధికారం మగాళ్లకు లేదంటూ చెప్పేశారు. ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆమె ఈ విషయాలతో పాటు మరికొన్ని ఆసక్తికర అంశాలపైనా స్పందించారు.

ఓపెన్ గా మాట్లాడటానికి మొహమాట పడే తీరుకు భిన్నంగా ఆండ్రియా ఒక ప్రముఖ మీడియా సంస్థకు  తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె ఏం మాట్లాడారంటే..

"కాస్టింగ్ కౌచ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కానీ ఒక విషయాన్ని మిస్ అయ్యా. అదేమంటే.. కాస్టింగ్ కౌచ్ కూడా ఆడవాళ్లకు ఇష్టప్రకారమే జరుగుతుంది. అందుకు ఇష్టపడిన వాళ్లు ఒప్పుకుంటారు. లేనివాళ్లు కుదరదని ముఖం మీదే చెప్పేస్తారు.  బయట చాలామందికి ఈ విషయం తెలీదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో ఒత్తిడి చేస్తారని చెబుతారు కానీ అది నిజం కాదు" అని చెప్పారు.  

సినిమా ఇండస్ట్రీలో ఆడవాల్ల టాలెంట్ గురించి ఆలోచించే వాళ్లు తక్కువ మంది ఉన్నారని.. అది తప్పని అంటారు ఆండ్రియా. ఆవకాశం ఇవ్వటం కోసం ఏదో ఆశించటం సరికాదని.. ఆ ఆఫర్ కావాలంటే అడ్జస్ట్ కాక తప్పదనే పరిస్థితిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవటమే అసలు సమస్యగా ఆమె చెప్పారు.

అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొందరు ఒప్పుకుంటారని.. మరికొందరు మాత్రం నో చెప్పేస్తారన్నారు. అయితే.. ఇలాంటివి కెరీర్కు ఏ మాత్రం ఉపయోగపడవని చెబుతారు. టాలెంట్.. హార్డ్ వర్క్ మాత్రమే సినిమా ఇండస్ట్రీలో నిలబెడతాయే తప్పించి.. అవకాశాల కోసం ఒప్పేసుకోవటం సరికాదని చెప్పారు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను చేశారు. ఈజీగా పైకి రావాలని అనుకోకూడదని.. తాను అలా అనుకునే వ్యక్తిని కాదన్నారు. అవకాశం వస్తే వచ్చింది లేకుంటే ఓపిగ్గా వెయిట్ చేద్దామనుకునే వాళ్లు.. నిజాయితీగా.. కష్టంలోనూ క్రమశిక్షణ ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయన్నారు. అలా వెయిట్ చేసే ఓపిక లేని వాళ్లు ప్రపోజల్స్కి ఒప్పుకుంటారేమోనని వ్యాఖ్యానించారు.