Begin typing your search above and press return to search.

ఎక్కువ రేటుతో సినిమా చూద్దాం రారండి

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:17 AM GMT
ఎక్కువ రేటుతో సినిమా చూద్దాం రారండి
X
దేశ ఆర్ధిక శాఖ కొత్త సర్విస్ టాక్స్ విదానం ఇప్పుడు సినిమా పై ప్రభావం చూపనుంది. జూలై 1 నుండి గూడ్స్ & సర్విస్ టాక్స్ (GST) కొత్త పన్ను విదానం దేశమంతా అమలుకానునుంది. సాధరణంగా ఒక వస్తువుకి ఉండేది ఒకరకమైన పన్ను మాత్రమే కానీ సినిమాకు మాత్రం రెండూరకాల పన్నులు కట్టవలసి ఉంటుంది. ఒకటి ఎంటర్టైన్మెంట్ టాక్స్ రెండు సర్విస్ టాక్స్. మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మిగతా రాష్ట్రాలు తో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే కడుతున్నారు. ఈ కొత్త పన్ను వలన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా టికెట్ రేట్లు పెరగనున్నాయి.

GST ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో జూలై 1 నుండి ఈ విదంగా టికెట్ రేట్లు మారనున్నాయి, GHMC రీజియన్ లో ఉన్న ఫస్ట్ క్లాస్ టికెట్ రూ.120.. లోయర్ క్లాస్ టికెట్ రేట్ రూ.40గా మారనుంది. అలాగే మునిసిపాలిటీలలో ఉన్న థియేటర్ల టికెట్ రేట్ ఫస్ట్ క్లాస్ అయితే 80 రూపాయలు లోయర్ క్లాస్ అయితే 30 రూపాయలుగా మారుతున్నాయి. అదే పంచాయతీలలో ఉన్న థియేటర్ల టికెట్ రేట్ ఫస్ట్ క్లాస్ 70 రూపాయలు లోయర్ క్లాస్ 20 రూపాయలుగా పెరగనున్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ కొత్త GST రేట్ విదానంలో.. మల్టీప్లెక్సులకు మాత్రం 100 రూపాయలు కన్నా ఎక్కువ ఉన్న సినిమా టికెట్ పై 28 శాతం అంతకన్నా తక్కువ ఉన్న సినిమా టికెట్ పై 18 శాతం పెంచారు. కాకపోతే మల్టీప్లెక్సులు ఇప్పుడు మొత్తంగా ఎంత పెంచుతున్నాయి అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఈ కొత్త టికెట్ రేట్లు అమలుపరచడంతో మిశ్రమ స్పందన వస్తుంది. టికెట్ రేట్ పెంచడం వలన సినిమా గ్రాస్ కలెక్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది కాని.. సినిమా టాక్ రివ్యూలు తేడాపడితే మాత్రం తగ్గిపోయే ఛాన్సుంది. రెండుసార్లు చూసేవాడు ఇప్పుడు ఒకసారి చూసి తృప్తి పడిపోతాడు. ఇంకా ముల్టీప్లెక్స్ టికెట్ కొని సినిమాకు వెళ్ళాలి అంటే సాధారణ మనిషి డేర్ చేయడనే చెప్పవచ్చు. ఇండియాలో జనాలు వినోదం కోసం చేసేది సినిమాలు చూడటం. అలాంటి సినిమా టిక్కెట్ రేట్ ఇలా పెంచడంపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని నిర్మాతలు - పంపిణీదారులు - కొనుగోలుదారులు కంగారు పడుతున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/