Begin typing your search above and press return to search.

ఏపీ ఫిలిం ఇండ‌స్ట్రీ గాల్లో దీపం

By:  Tupaki Desk   |   23 Sep 2018 5:35 AM GMT
ఏపీ ఫిలిం ఇండ‌స్ట్రీ గాల్లో దీపం
X
ఏపీ ఫిలిం ఇండ‌స్ట్రీ .. గ‌త నాలుగేళ్లుగా ఇదో హాట్ టాపిక్‌. తెలంగాణ నుంచి విడిపోయిన ఏపీకి ఓ కొత్త సినీప‌రిశ్ర‌మ అత్యావ‌శ్య‌కం. టాలీవుడ్‌ పేరుతో ప్ర‌త్య‌క్ష‌-ప‌రోక్షంగా ప్ర‌భుత్వానికి 2500 కోట్లు పైగా ప‌న్ను ఆదాయం ద‌క్కుతుంద‌న్నది ఓ అంచ‌నా. ఆ ప‌న్నులో మెజారిటీ వాటా ఏపీ బెల్ట్‌ కు చెందిన‌ నిర్మాత‌లు- ఫిలిం మేక‌ర్స్‌ దే. అందువ‌ల్ల ఏపీకి ప‌రిశ్ర‌మ వెళ్లిపోతే ఆ మొత్తం ప‌న్ను అక్క‌డ ప్ర‌భుత్వ ఖ‌జానాకే చేరుతుంద‌న్న విశ్లేష‌ణ చేశారు. కానీ అది జ‌రుగుతోందా? అందుకు ఏపీ ప్ర‌భుత్వం ఏదైనా చేస్తోందా? అంటే అదంతా గుండు సున్నా అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ ఫిలింఇండ‌స్ట్రీ విష‌యంలో చంద్ర‌బాబు చిత్త‌శుద్ధిపై అంద‌రికీ పెనుసందేహాలు ఉన్నాయి. ఇటు సినీఇండ‌స్ట్రీ పెద్ద‌ల్లోనే బోలెడంత వ్య‌తిరేక‌త నెల‌కొంది. పైకి బాబు ఇండ‌స్ట్రీ పెడ‌తారు! అంటూ మాట్లాడే వాళ్లే ఆయ‌న‌ వ‌న్నీ డ్రామాలు అంటూ తిట్టేస్తారు. చంద్ర‌బాబు డ్రామాలు అవ‌న్నీ. అందులో నిజాయితీ సున్నా.. ఫిలిం ఇండ‌స్ట్రీ పెట్టేస్తామంటూ నాట‌కాలే త‌ప్ప స్వ‌చ్ఛ‌మైన ప్ర‌య‌త్నం లేద‌న్న విమ‌ర్శ‌లు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి క‌దిపినా తేదేపా అధినాయ‌కుడి ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం.. ప‌నులు శూన్యం అన్న ఆవేద‌న క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్పాటు క్ర‌మంలో చంద్ర‌బాబు కొత్త ఫిలిం ఇండ‌స్ట్రీ గురించి చాలానే మాట్లాడారు. మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు వంటి వారు వైజాగ్ ఇండ‌స్ట్రీ గురించి ఊద‌రగొట్టేశారు. తెగ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. అదంతా నిజ‌మేన‌ని అప్ప‌టికి జ‌నం కూడా కంగారు ప‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత సీఎం పీఠం ఎక్కాక‌.. పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ త‌ర‌హా ఏపీలో ప్రారంభిస్తామ‌న్నారు. వైజాగ్ కేంద్రంగా ఫిలిం ఇండ‌స్ట్రీ అభివృద్ధి చేస్తామ‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే దీనిపై ఇప్ప‌టికీ జీరో వ‌ర్క్‌. ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం.. ప‌నులు శూన్యం అని ప్రూవైంది. మొన్న‌టికి మొన్న ఏపీ ఎఫ్‌ డీసీ భారీగా స్టూడియోలు క‌ట్టేందుకు చంద్రబాబు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చేసింది. బాల‌కృష్ణ స్టూడియో - ఏవీఎం స్టూడియో అంటూ ఘ‌నంగా ప్ర‌క‌టించేశారు. అయితే ఇప్ప‌టికీ ప‌నులు శూన్యం. ప్ర‌క‌ట‌న మాత్రం ఘ‌నంగానే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఫిలిం ఇండ‌స్ట్రీ అనేది ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టేందుకు తెర‌పైకి తెచ్చే బూచీ మాత్ర‌మేన‌ని ఫిలింఛాంబ‌ర్‌ కి చెందిన ఒక పెద్దాయ‌న కామెంట్ చేశారంటే బాబుపై ఎంత న‌మ్మక‌మో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ధ్య మ‌ధ్య‌లో జోకొట్టే ప‌ని త‌ప్ప కొత్త ఇండ‌స్ట్రీ ఏర్పాటు విష‌యంలో బాబులో నిజాయితీ శూన్యమ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు స‌ద‌రు పెద్ద‌మ‌నిషి.

అస‌లు సినీప‌రిశ్ర‌మ అన్న‌ది పెద్ద బూచీ. రంగుల ప్ర‌పంచం పేరుతో జ‌నాల‌కు చుక్క‌లు చూపించ‌డం అన్న‌మాట‌! రాజ‌కీయాల్లో క‌రివేపాకులా వాడి విసిరేయ‌డానికే. త‌న అవ‌స‌రానికి సినిమా వాళ్ల‌ను వాడుకోవ‌డానికి ఆడే నాట‌కం ఇదంతా. అదో ర‌కం పొలిటిక‌ల్ గేమ్ మాత్ర‌మే. వైజాగ్‌ లో ఇండ‌స్ట్రీ, త‌డ‌-నెల్లూరు శ్రీ‌సిటీలో ఫిలిం ఇండ‌స్ట్రీ అంటూ ఏపీలో బోలెడంత‌ ఉత్త ప్ర‌చారం సాగించారు. కొత్త ఫిలిం ఇండ‌స్ట్రీ వ‌ల్ల బోలెడంత ఉపాధి పెరుగుతుంద‌ని ప్రొప‌గండా సాగించారు. దీంతో గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ ఉపాధి కోసం యూత్ ఉవ్విళ్లూరారు. కానీ అదంతా వ‌ట్టి వాగుడుకాయ‌ వ్య‌వ‌హార‌మే అని తెలుసుకోవ‌డానికి యువ‌త‌రానికి పెద్ద‌గా టైమ్ ప‌ట్ట‌లేదు. ఇక వైజాగ్ ఇండ‌స్ట్రీ అన‌గానే స‌హ‌జంగానే అటువైపు గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ ఆస‌క్తి, ఎగ్జ‌యిట్‌మెంట్ ఎక్కువ‌. నిజంగానే బాబు అన్నంత ప‌నీ చేసేస్తాడేమో! అని యూత్ తెగ‌ కంగారు ప‌డ్డారు. కానీ ఏదీ లేదు. అంతా గుండు సున్నా. ఇప్పుడు ఎన్నిక‌ల హ‌డావుడిలో ప‌డ్డారు. కొన్ని నెల‌ల్లోనే ఎల‌క్ష‌న్ ఉంది కాబ‌ట్టి ఓట్లు గుంజుకునే వ్యూహాలు త‌ప్ప నిజాయితీగా ప‌నులు చేసేదేం ఉండ‌దు. వైజాగ్ ఇండ‌స్ట్రీ అన్న మాట‌నే ఇక పూర్తిగా మ‌ర్చిపోతారు. పూణే త‌ర‌హా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ రాదు. స్టూడియోలు క‌ట్ట‌రు. ఉపాధిని పెంచ‌రు! ఇది ప‌క్కా అందులో డౌటేం అక్క‌ర్లేదు!! ఇదీ జ‌నాల్లో అస‌లైన నైరాశ్యం.