Begin typing your search above and press return to search.

జనతా గ్యారేజ్.. జీ.ఓ. పాస్ చేయలేదా?

By:  Tupaki Desk   |   30 Aug 2016 10:00 AM GMT
జనతా గ్యారేజ్.. జీ.ఓ. పాస్ చేయలేదా?
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పుడు 'జనతా గ్యారేజ్' కోసం భయంకరమైన పంచ్ ఇచ్చిందని నిన్నంతా తెగ హడావుడి వినిపించింది. కాని ఇదే విషయాన్ని కొందరు బ్యూరోక్రాట్లను ప్రశ్నిస్తే.. కావాలంట రాష్ట్రం విడుదల చేసిన జీ.ఓ. లన్నీ చూసుకోండి.. అసలు ఏ సినిమా టైమింగుల గురించీ ఎటువంటి ఆర్డర్లు పాస్ చేయలేదు అంటున్నారు అధికారులు.

అర్ధరాత్రి 12 గంటలకు.. అలాగే తెల్లవారుజామున 4 గంటలకు ఎటువంటి సినిమాలు పాస్ చేయకూడదని గవర్నమెంట్ ప్రత్యేక ఆర్డర్లు పాస్ చేసింది అనే న్యూస్ రావడంతో.. సెప్టెంబర్ 1న రిలీజయ్యే ''జనతా గ్యారేజ్'' సినిమా బెనిఫిట్‌ షోలకు ఎసరు పడినట్లేనని అందరూ అనుకున్నారు. ఇప్పటికే 25 లక్షలకు పైగా చెల్లించి బెనిఫిట్ షో రైట్స్ కొనుకున్న బయ్యర్లు.. ఈ దెబ్బతో బెంబేలెత్తిపోయారు. కాకపోతే ఇప్పటివరకు అఫీషియల్ గా ఎటువంటి జీ.ఓ. అనేది పాస్ కాకపోవడంతో.. వీరందరూ ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. పోలీస్ పర్మిషన్ తో ఇప్పుడు ఏ టైమ్ లోనైనా షో వేసుకోవచ్చు.

మొత్తానికి తెలంగాణలోనే కాకుండా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కూడా అభిమానులందరూ జనతా గ్యారేజ్ సినిమాను అర్ధరాత్రే చూడ్డానికి అవకాశాం ఉందన్నమాట.