Begin typing your search above and press return to search.

ఇద్దరు యాంకర్లు లేకపోతే ఇంత కరువా ?

By:  Tupaki Desk   |   16 July 2019 5:12 AM GMT
ఇద్దరు యాంకర్లు లేకపోతే ఇంత కరువా ?
X
ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో చాలా కీలకంగా మారుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ కావడంలో యాంకర్లు పోషిస్తున్న పాత్ర చిన్నదేమీ కాదు. చిన్న హీరో అయినా పెద్ద స్టార్ అయినా వేడుకకు నిండుతనం తెచ్చి మాటలతో కోటలు కట్టేసి వచ్చిన వాళ్లకు కిక్ ఇవ్వడంతో వీళ్ళ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే సుమ వన్ అండ్ ఓన్లీ యాంకర్ గా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత యాంకర్ శ్యామల-ఝాన్సీ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ సుమతో మాత్రం ఎవరూ పోటీ పడలేరు.

ఇప్పుడు తాను తానా సభల కోసం అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడేమో వరసబెట్టి ఈవెంట్లు ఉన్నాయి. ఆయా హీరో హీరోయిన్ల రేంజ్ కు తగ్గట్టు అన్ని పెద్ద బడ్జెట్లే. కానీ సుమ అందుబాటులో లేకపోవడం ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఓపెన్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి కుటుంబానికి పరిమితమైన ఓ సీనియర్ లేడీ యాంకర్ తో ఇటీవలే ఓ ఈవెంట్ చేయడం అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. నలభై పడి దాటిన మరో యాంకర్ తో ఇంకో ఈవెంట్ జరిగింది కానీ అక్కడా సేమ్ రిజల్ట్.

ఫాన్స్ ని మాటలతో కంట్రోల్ చేయడం వేదిక మీద అతిధులను పిలిచే క్రమంలో జాగ్రత్తలు వహించడం ఇవన్నీ టైమింగ్ ఉన్న వాళ్ళు చేసే పనులు. కానీ అది ఈ ఇద్దరి వల్ల కాకపోవడంతో రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చింది. శ్యామల బెటర్ అనుకుంటే తాను కూడా తానాలోనే ఉంది. ఒక ఇద్దరు యాంకర్లు లేకపోతే కోట్ల రూపాయల పెట్టుబడులతో సాగుతున్న టాలీవుడ్ ఈవెంట్ల పరిస్థితి ఇది అని నిర్మాతలు వాపోతున్నారు.