Begin typing your search above and press return to search.

జూనియర్ ప్రోగ్రామ్.. నో చెప్పిన యాంకర్

By:  Tupaki Desk   |   24 Jun 2017 10:47 AM GMT
జూనియర్ ప్రోగ్రామ్.. నో చెప్పిన యాంకర్
X
ఎన్టీఆర్ తో ఆఫర్ అంటే.. ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకోవాల్సిందే. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ మహత్యం అది. అయితే.. ఇది సినిమాల వరకూ బాగానే వర్కవుట్ అవుతుంది. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపైకి వస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ను యంగ్ టైగర్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో ఎన్టీఆర్ పై ఎపిసోడ్స్ పిక్చరైజేషన్ కి యూనిట్ రెడీ అవుతోంది. అందుకే ఇప్పుడు పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేసేందుకు తెగ కష్టపడిపోతున్నారు ఛానల్ యాజమాన్యం. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా తెలుగు టెలివిజన్ టాప్ యాంకర్ అయిన సుమను అప్రోచ్ అయ్యారట బిగ్ బాస్ టీం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెకు భారీ మొత్తమే ఆఫర్ చేశారట కూడా. కానీ సుమ మాత్రం సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించిందని తెలుస్తోంది.

నెల రోజులకు పైగా ఒక షో కోసం కేటాయించడం.. అది కూడా హైద్రాబాద్ లో కాకుండా ముంబైలో ఉండాల్సి రావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకున్న సుమ.. ఎన్టీఆర్ షో బిగ్ బాస్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఇప్పటికే రైటర్ కం యాక్టర్ పోసాని కృష్ణమురళిని అప్రోచ్ అయ్యారని ఓ టాక్ ఉంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/