Begin typing your search above and press return to search.

హైట్ తక్కువైందని శ్రీముఖిని తప్పించేశారు

By:  Tupaki Desk   |   27 March 2017 5:51 AM GMT
హైట్ తక్కువైందని శ్రీముఖిని తప్పించేశారు
X
ఇప్పుడు ఫిలిం ఇండస్ర్టీలో కాంబినేషన్లు అనేవి చాలా క్రేజీగా సృష్టింస్తారు. మహేష్‌ బాబు కంటే భూమిక హైట్ చాలా తక్కువ. ఇద్దరి పెయిరింగ్ చాలా ఆడ్ గా ఉంటుంది. అయినాసరే 'ఒక్కడు' సినిమా సూపర్ హిట్ అయ్యింది. అది గుణశేఖర్ కన్విక్షన్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం ఒక ఐటెం సాంగ్ కోసం ఒక చబ్బీ యాంకర్ హైట్ తక్కువైందని ఆమెను తప్పించేశారు.

శ్రీనువైట్ల డైరక్షన్లో రూపొందిన ''మిష్టర్'' సినిమా కోసం ఒక క్రేజీ ఐటెం సాంగును తీస్తున్నారు. ఆ పాటలో ఎవరైనా పాపులర్ తెలుగు యాంకర్ అయితే హైప్ బాగుంటుందని భావించిన శ్రీను వైట్ల.. అనసూయ అండ్ రష్మి ఆల్రెడీ వెండితెరపై అలాంటి పాటల్లో మెరిశారు కాబట్టి.. శ్రీముఖితో చేస్తే బాగుంటుందని డిసైడయ్యాడట. కాని వరుణ్‌ తేజ్ ప్రక్కనే శ్రీముఖి హైట్ చాలా చిన్నదిగా ఉండటంతో.. చివరకు ఆమెను తప్పించేశారు.

ఇప్పుడు శ్రీముఖి ప్లేసులో బాహుబలి 1లోని మనోహరా సాంగులో మెరిసిన మధుస్నేహ అనే సుందరి రంగంలోకి దిగుతోంది. ఈమె స్వతాహాగా డ్యాన్సర్ పైగా హాట్ మోడల్ కావడంతో.. ఇక మిష్టర్ సరసన ఈ మిస్సు తన సోకుల మిసమిసలు ఒక రేంజులో కురిపిస్తుందని అంటున్నారు. లెటజ్ సీ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/