Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: యాంకర్ 'నా' ప్రేమకథ

By:  Tupaki Desk   |   22 May 2017 12:30 PM GMT
టీజర్ టాక్: యాంకర్ నా ప్రేమకథ
X
''ఇది మా ప్రేమకథ'' అంటూ ఇప్పుడు ఒక సినిమా వస్తోంది. అసలు హీరో అవుదాం అని ఫిలిం నగర్ బస్సెక్కిన యాంకర్ రవి.. మధ్యలో యాంకర్ గా మారిపోయాడు. ఇప్పుడు యాంకరింగ్ లో బాగా సక్సెస్ అయిపోయాక.. మనోడు సింపుల్ సినిమాతో హీరోగా తెర మీదకు వస్తున్నాడు. ఒక మంచి లవ్ స్టోరీని ఎంచుకున్నాడు.

ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. అందరిలాగే సింపుల్ గా ఒకమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. చివరకు ఆమె దక్కుతుందా దక్కదా అనేదే సినిమా. ఆమె పక్కన లేదు కాబట్టి.. ఇది 'మా' ప్రేమకథ అనుకోవాల్సిన నేను.. 'నా' ప్రేమకథ అని చెప్పుకుంటున్నా అంటూ హీరో చెబుతాడు. అంటే ఇదో ట్రాజిక్ లవ్ స్టోరి అనుకోవాలా? టీజర్ చూస్తే మాత్రం.. కొత్త కుర్రాడు అయోధ్య కార్తీక్ చాలా రొటీన్ గానే తీశాడని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి రొటీన్ సినిమాలు కూడా ఒక్కోసారి మ్యూజికల్ గా హిట్టయితే మాత్రం జనాలకు ఎక్కేస్తాయి. లేదంటే మన లౌడ్ యాంకర్ కు మొట్టికాయ పడుతుంది.

ఇకపోతే తెలుగుతెరపై యాంకర్లుగా క్లిక్కయ్యి అసలు హీరోలు అయినవారు ఎవ్వరూ లేరు. మరి రవి దగ్గర అంత కెపాసిటీ ఉందా లేదా అనేదే అతను ఎంచుకునే సినిమాలు వాటి రిజల్టుల మీదనే ఆధారపడి ఉంటుంది. లెటజ్ సీ.