బరువు గురించి హాట్ యాంకర్ కామెంట్స్

Wed Oct 17 2018 23:23:45 GMT+0530 (IST)

హిట్ కాకపోయినా జనాలు పెద్దగా పట్టించుకోకపోయినా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్న హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ముప్పై వయసు దాటుతున్న క్రమంలో కొన్ని కామెంట్స్ చేయటం ఆసక్తి రేపుతోంది. ఇంకా ఆ మార్కు దాటలేదు అంటూనే బరువు గురించి మాట్లాడిన రష్మీ సినిమా తారల లాగా తమకు రెగ్యులర్ గా వర్క్ అవుట్స్ చేసుకునే సమయం ఉండదని అదే పనిగా ఫిజిక్ మీద శ్రద్ధ వహించే అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. అయినా బరువేమంత పెద్ద సమస్య కాదని తగ్గడం పెరగడం ఓ సహజ ప్రక్రియ అని చెప్పిన రష్మీ మొత్తానికి ఆ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని కొట్టిపారేసింది. కాకపోతే మరికొన్ని విషయాలు మాత్రం అభిమానులకు షాక్ కలిగించేలా ఉన్నాయి.తనకు రోగ నిరోధక శక్తి తక్కువట. 12 ఏళ్ళ వయసులోనే కీళ్లవాతంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తాను చూసిన నరకం తనకు మాత్రమే తెలుసని చెప్పిన రష్మీ కెరీర్ జీవితంలో భాగమే కానీ అదే లైఫ్ అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. అయినా శరీరం బరువు అనేది మనం కోరుకునేది కానీ బలవంతంగా అవసరం లేనివి చేసి  తెచ్చుకునేది కాదని కుండ బద్దలు కొట్టేసింది. అంతే కాదు బరువు తగ్గే ప్రోగ్రాములు తన ఒంటికి సరిపడవట. ఎవరి శరీర స్వభావం వాళ్లకు విడిగా ఉంటుందన్న రష్మీ మొత్తానికి వెయిట్ లాస్ విషయంలో చాలా క్లారిటీతో ఉంది. ఇటీవలే అంతకు మించి అనే సినిమాలో రష్మీ థైస్ గురించి పెద్ద చర్చే జరిగిన సంగతి తెలిసిందే. వాటిని కాకుండా సినిమాను చూడమని రష్మీ చెప్పడం బాగా వైరల్ అయ్యింది కూడా.