ఆ ఫ్లెక్సీ పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ బ్యూటీ

Sun Dec 09 2018 11:48:07 GMT+0530 (IST)

జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రష్మి గౌతమ్ కు బుల్లి తెరలో పాపులారిటీ ఎక్కువే.  ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ తో ప్రేక్షకులను అలరించడంతో పాటు గా సినిమాల్లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. ఈ మధ్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది.తిరుపతి లో డిసెంబర్ 9 న జరిగే 'స్టే ఫిట్ తిరుపతి 10K రన్' అనే కార్యక్రమాని కి రష్మీ గౌతమ్.. జబర్దస్త్ పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్ లు హాజరవుతున్నారని ఒక ఫ్లెక్సీ కట్టారు.  ఈ ఫ్లెక్సీ విషయం రష్మీ దృష్టి కి రావడంతో ఆ ఫ్లెక్సీ ఫోటో తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి "ఈ ఈవెంట్ లో నేను పాలుపంచుకోవడం లేదు.  ఆర్గనైజర్లు ఏ విషయం తేల్చకుండానే నా ఫోటో ఫ్లెక్సీ పై పెట్టారు. ఎవరికైనా ఈ కార్యక్రమం ఆర్గనైజర్లు తెలిస్తే వారికి ఈ విషయం తెలపండి. #ఫేక్ అలెర్ట్" అంటూ ట్వీట్ చేసింది.

రష్మి - సుడిగాలి సుధీర్ పై వచ్చిన పెళ్ళి పుకార్ల సంగతి అందరి కీ తెలిసిందే.  ఈ కార్యక్రమ నిర్వాహకులు పబ్లిసిటీ కోసం వాడుకుందామని అనుకున్నారేమో.. రష్మీ తన వైపు నుండి ఫుల్ గా క్లారిటీ ఇచ్చింది.  సోషల్ మీడియా వల్ల చాలామంది సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నామని ఓపెన్ గానే చెబుతుంటారు.  ఇప్పుడు రష్మి మాత్రం ఫేక్ న్యూస్ విషయంలో ఫ్యాన్స్ ను అలెర్ట్ చేసి సోషల్ మీడియా వల్ల ఉపయోగం కూడా ఉందని ప్రూవ్ చేసింది!