Begin typing your search above and press return to search.

యాంక‌ర్ కొత్త కార్ తెచ్చిన తంటా

By:  Tupaki Desk   |   18 March 2019 4:25 AM GMT
యాంక‌ర్ కొత్త కార్ తెచ్చిన తంటా
X
`జ‌బ‌ర్ధ‌స్త్` ఫేం.. యాంక‌ర్ ర‌ష్మి కార్ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఓ యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఆదివారం మిడ్ నైట్ ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ యాక్సిడెంట్ కి కార‌ణ‌మేంటి? అన్న దానిపై పోలీస్ విచార‌ణ సాగుతోంది. ఇటీవలే ర‌ష్మి ఓ కొత్త కారు కొనుక్కున్నార‌ట‌. ఆ కార్‌ లో విశాఖపట్నం జిల్లా గాజువాక కూర్మన్నపాలెం రోడ్ లో వెళుతున్నారు. అయితే ఓ జంక్ష‌న్ స‌మీపంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 11 గం.ల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

స్పాట్ నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ప్రమాదం అనంత‌రం గాయపడిన వ్యక్తిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం చికిత్స కొన‌సాగుతోంది.

ర‌ష్మి ఓవైపు బుల్లితెర హోస్ట్ గా బిజీ. మ‌రోవైపు క‌థానాయిక‌గానూ అడ‌పాద‌డ‌పా న‌టిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు హైద‌రాబాద్ - వైజాగ్ వంటి చోట్ల ర‌ష్మి రిబ్బ‌న్ క‌టింగ్ కార్య‌క్ర‌మాల‌తోనూ బిజీగా ఉంటారు. అందువ‌ల్ల ప్ర‌యాణాలు ఎక్కువేన‌ని తెలుస్తోంది.