నాకేం తెలీదంటున్న యాంకర్

Wed Jun 20 2018 17:33:49 GMT+0530 (IST)

టాలీవుడ్ ను నిన్న మొన్నటిదాకా కుదిపేసిన కాస్టింగ్ కౌచ్ వివాదం ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతోది. ఇంతలో అమెరికాలో చికాగో పోలీసులు బయటపెట్టిన సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. చికాగోలోని మోదుగుమూడి కిషన్- చంద్రకళ దంపతులు తెలుగు ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ వచ్చారు. అనూహ్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం టాలీవుడ్ కే కాదు.. తెలుగు టీవీ ఛానళ్లకూ తలనొప్పిగా మారింది.కిషన్ దంపతులు నిర్వహించిన ఈవెంట్లలో హీరోయిన్లే కాదు... తెలుగు టీవీ ఛానళ్లలో బాగా పరిచయం ఉన్న యాంకర్లు కూడా పాల్గొన్నారు. తరచూ అమెరికా వెళ్లొచ్చిన ఆరుగురు యాంకర్లను ఇప్పుడు అంతా అనుమానంగా చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఓ పాపులర్ యాంకర్ ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఇష్యూ రోజురోజుకు వేడెక్కుతుండటంతో చాలా ఇబ్బంది పడుతోందట. అసలు తనకు ఈ వ్యవహారం గురించి ఏమీ తెలియదని.. తెలిస్తే అసలు వాళ్ల ప్రోగ్రాంకు వెళ్లేదాన్నే కాదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతో ఆ యాంకర్ సైలెంట్ గానే ఉంటోంది. అసలే పెళ్లయిన ఈ యాంకర్ ఈ ఇష్యూ మూలంగా తన సంసారం వీధిన పడుతుందని ఆందోళన పడుతోందట. కొన్ని యూట్యూబ్ ఛానళ్లయితే సెక్స్ రాకెట్ ఉన్నది వీళ్లేనంటూ కథనాలు కూడా వండి వార్చేస్తున్నాయి. దీంతో లేనిపోని తలనొప్పి ఎందుకనే ఉద్దేశంతో ఒకరిద్దరు యాంకర్లు తమకు కిషన్ - చంద్రకళ తో పరిచయం ఉంది తప్ప చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఏమీ పాల్పడలేదని క్లారిటీ ఇస్తున్నారు. మరో ఇద్దరు తమకు వారి గురించి తెలుసని.. అందుకే ఈవెంట్ కు వెళ్లినా వాళ్లను దూరంగా పెట్టామని చెప్పుకొస్తున్నారు.