కన్నీరు మున్నీరైన యాంకర్ అనసూయ!

Wed Dec 21 2016 18:43:32 GMT+0530 (IST)

కావాల్సిన వారిని కోల్పోతే - అయినవారు శాస్వతంగా దూరమైతే.. కెరీర్ లోనూ - వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో ప్రోత్సహించిన వ్యక్తులు ఉన్నపలంగా ఈ లోకం వీడి వెళ్లిపోతే.. ఆ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. అది చూసినవారికంటే.. అనుభవించినవారికే బాగా తెలుస్తుంది. తాజాగా అలాంటి పరిస్థిని ఎదుర్కొంది యాంకర్ అనసూయ. ప్రస్తుతం టాలీవుడ్ లో అటు బుల్లితెరపై అడపదడపా ఇటు వెండితెరపైనా వెలిగిపోతున్న హాట్ యాంకర్స్ లో అనసూయ ఒకరు. తనదైన వాక్ చాతుర్యంతో అందంతో ముఖ్యంగా ప్రముఖ చానెల్ లో వచ్చే కామెడీ షోలో తన యాంకరింగ్ తో కట్టిపడేసే అనసూయ ఉన్నట్లుండి వెక్కివెక్కి ఏడ్చింది.బుల్లితెరలో ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అయిన పచ్చా మధు తీవ్ర అనారోగ్యంతో ఇటీవల మరణించారు. అయితే ఆయన మృతికి నివాళిగా ఒక సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభలో యాంకర్ అనసూయ కన్నీటి పర్యంతమైంది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మధు తనను వ్యక్తిగతంగా ఎంతగా ప్రోత్సహించారని కెరీర్ లో ఎంతగానో ఆయన ఊతమిచ్చారని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన అనసూయ ఉన్నపలంగా  కన్నీరుమున్నీరైంది.

కాగా.. అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందిన మధు ఈ నెల 8న మరణించాడు. ఈ నేపథ్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆ సంతాప సభలో పాల్గొన్న అనసూయ ఆయన గురించి మాట్లాడుతూ తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది. సభ మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఆయన గురించి మాట్లాడే దాకా అనసూయ దు:ఖంతోనే ఉంది. కామెడీ షో టీమ్ తో మధుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... మందు అందరినీ ఎంతో ప్రోత్సహించేవారని ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని ఆమె దు:ఖ స్వరంతో చెప్పింది. నిత్యం నవ్వుతూ నవ్విస్తూ తన నవ్వుతో నలుగురినీ మురిపిస్తూ కనిపించే అనసూయ అలా ఏడ్చే సరికి అక్కడున్నవారికి కళ్లు చెమ్మగిల్లాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/