Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్ లో అనసూయ!!

By:  Tupaki Desk   |   24 April 2018 6:16 PM GMT
మల్టీస్టారర్ లో అనసూయ!!
X
ఈ మధ్య బుల్లితెరపై ఎంతగానో అలరిస్తున్న హాట్ యాంకర్స్ వెండితెరపై కూడా మంచి నటనతో ఆకట్టుకుంటున్నారు. గత కొంత కాలంగా జబర్దస్త్ షోలో కొనసాగుతోన్న హాట్ యాంకర్ అనసూయ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ షో ద్వారా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మంచి ఆఫర్స్ ను అందుకుంటూ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తోంది. క్షణం సినిమాలో క్లిక్ అయిన ఈ బ్యూటీ రంగస్థలం సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది.

రామ్ చరణ్ కు అత్తగా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం తనకు నచ్చిన క్యారెక్టర్స్ ని మాత్రమే ఒకే చేస్తోంది. ఒకే చేసే ముందు కథలో కీలకమైన పాత్రనా లేక నార్మల్ క్యారెక్టరా అని గట్టిగానే అరా తీస్తోందట. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. అనసూయ రీసెంట్ గా ఒక మంచి ప్రాజెక్ట్ లో అవకాశాన్ని అందుకుంది.

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోగా F2 అనే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఒక క్యారెక్టర్ చేస్తారా అని అడగ్గానే అనసూయ ఏ మాత్రం నో చెప్పకుండా ఒకే చేసిందట. సినిమాలో కీలకమైన పాత్రే అని తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని తెలుపలేదు గాని దాదాపు అనసూయ F2 ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు సమాచారం.